ఉలగనాయగన్ కమల్ హాసన్,భారీ బడ్జెట్ చిత్రాల దర్శకుడు శంకర్ కలయికలో 1996 లో వచ్చిన చిత్రం భారతీయుడు. వ్యవస్థల్లో కురుకుపోయిన అవినీతిని అంతమొందించి, సామాన్యుడికి న్యాయం చేసేందుకు భారతీయుడు చేసిన పోరాటాలకు అటు తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ ప్రేక్షకులతో పాటు హిందీ ఆడియన్స్ కూడా ఫిదా అయ్యారు. భారీ బడ్జెట్ తో రూపొందిన భారతీయుడుకు ఘాన విజయం కట్టబెట్టారు. ఈ చిత్రానికి సిక్వెల్ గా మరోసారి అదే కలయికలో భారతీయుడు-2 ను తెరకెక్కించాడు దర్శకుడు శంకర్.
Also Read: Devara: సెకండ్ సింగిల్ రిలీజ్ వేళ నిర్మాత నాగవంశీ ఆసక్తికర ట్వీట్..
గత నెల 12న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఇండియన్-2 బాక్సాఫీస్ వద్ద దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. దాదాపు రూ.250 కోట్ల థియేట్రికల్ టార్గెట్ తో వచ్చిన ఈ చిత్రం కనీసం 150 కోట్ల రూపాయలు కూడా రాబట్టలేక బాక్సాఫీస్ వద్ద చతికిలబడింది. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రాన్ని డిజిటల్ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ దాదాపు రూ. 120 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ నిర్మాతలకు సదురు ఓటీటీ సంస్థలకు తకరారు నడిచింది. తమిళ సినీ వర్గాల సమాచారం ప్రకారం నెట్ ఫ్లిక్స్, లైకా మధ్య భారతీయుడు -2 వివాదం ముగిసిందని సమాచారం. ఇక మరోవైపు ఇండియన్ -2 థియేట్రికల్ రన్ కూడా దాదాపు ముగిసినట్టే. దీంతో భారీ రేట్ కు డిజిటల్ రైట్స్ కొనుగోలు చేయడం,థియేటర్లలో భారీ ఫ్లాప్ గా నిలవడంతో డిజిటల్ ప్రీమియర్ గా ఇండియన్ -2 ను ఒప్పందం కంటే ముందుగా ఆగస్టు 9న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సదరు సంస్థ. దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది.