శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా పోర్న్ కేసులో కీలక మలుపులు తిరుగుతోంది. బాలీవుడ్ నటి, రాజ్ కుంద్రా భార్య శిల్పాశెట్టి ఈ సంస్థలో తన ప్రమేయం లేదని చెబుతూ వారు చిత్రీకరించింది పోర్న్ కాదని వాదిస్తోంది. శుక్రవారం కోర్టు విచారణ తరువాత శిల్పా, రాజ్ జుహు నివాసంపై క్రైమ్ బ్రాంచ్ బృందం దాడి చేసింది. దర్యాప్తు బృందం డబ్బు, వివాదానికి సంబంధించిన ఈమెయిల్‌ల కోసం వెతికింది. ఏవైనా ఆధారాలు దొరికితే అశ్లీల చిత్రాల మేకింగ్ కేసులో రాజ్ ప్రమేయం నిర్ధారణ అవుతుంది. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఈ కేసులో క్రైమ్ బ్రాంచ్ అధికారులు శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. హాట్ షాట్స్ కంటెంట్ గురించి తనకు తెలియదని, అసలు ఇందులో తన ప్రమేయం లేదని శిల్పా తనపై వస్తున్న ఆరోపణలను ఖండించింది.
Read Also : “పుష్ప”కు మళ్ళీ బ్రేక్… అనారోగ్యం బారిన క్రియేటివ్ డైరెక్టర్
‘ఎరోటికా’ పోర్న్ కంటే భిన్నంగా ఉంటుందని, అవి రెండూ ఒకటి కాదని, దీని వలనే తన భర్తపై ఆరోపణలు వచ్చాయని, అతను పోర్న్ కంటెంట్‌ను నిర్మించడంలో పాల్గొనలేదని ఆమె పేర్కొన్నారు. యాప్ కు సంబంధించిన కార్యకలాపాలను ప్రదీప్ భక్షి చూసుకుంటున్నాడని, ఇందులో తన భర్తకు సంబంధం లేదని వెల్లడించింది. ఈ కేసు వెలుగులోకి వచ్చిన తరువాత శిల్పా శెట్టి కుంద్రా తన భర్త వయాన్ ఇండస్ట్రీస్ కు రాజీనామా చేసి, తన బాలీవుడ్ ప్రాజెక్ట్ ల నుండి కూడా వైదొలిగారు. ఇందులో టెలివిజన్ రియాలిటీ షో, ఓ చిత్రం ఉన్నాయి. క్రికెట్ బెట్టింగ్ వివాదం తరువాత చాలాకాలానికి మళ్ళీ రాజ్ కుంద్రాను వివాదంలో చిక్కుకున్నాడు. అశ్లీల కేసులో ముంబై క్రైమ్ బ్రాంచ్ అతన్ని అరెస్టు చేసింది. కోర్టు తన ఐటి హెడ్ ర్యాన్ త్రోప్‌తో పాటు జూలై 27 వరకు రాజ్ పోలీసు కస్టడీని పొడిగించింది.