Huge Changes in Prabhas Lineup: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కల్కి 2898తో సూపర్ హిట్ కొట్టాడు. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే 1000 కోట్ల కలెక్షన్లు దాటేసి 1100 కోట్ల కలెక్షన్ దిశగా పరుగులు పెడుతోంది. ఇక ప్రస్తుతానికి ప్రభాస్ యూరోప్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్నాడు. త్వరలోనే ఇండియాకి తిరిగి రాబోతున్నాడు. ఇండియా తిరిగి వచ్చిన వెంటనే ఆయన మారుతి సినిమాకి సంబంధించి మిగిలిపోయిన షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. ఈ సినిమా కాకుండా ప్రభాస్ మరో రెండు సినిమాలు సైన్ చేసాడు. అందులో ఒకటి సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా కాగా మరొకటి హను రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజి అనే సినిమా. అయితే మారుతి సినిమా పూర్తి అవ్వగానే సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమా మొదలు పెట్టాల్సి ఉంది. కానీ ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ అలాగే స్క్రిప్ట్ వర్క్ లేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మరొకపక్క హను రాఘవపూడి ఫౌజి సినిమా షూటింగ్ అక్టోబర్ మొదటి వారంలో ప్లాన్ చేస్తున్నాడు.
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్, ఎక్కువ ఊహించుకోవద్దు.. నిరాశ తప్పదు!
కాబట్టి ప్రభాస్ సినిమాల లైనల్ లో కాస్త మార్పులు చేర్పులు చోటు చేసుకోవచ్చు. స్పిరిట్ సినిమా వెనక్కి వెళ్లి ఫౌజీ సినిమా ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక స్పిరిట్ సినిమా స్క్రిప్టింగ్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ కూడా లేట్ అయ్యే అవకాశం ఉండడంతో వచ్చే ఏడాది మొదట్లో షూటింగ్ ప్లాన్ చేసే అవకాశం కనిపిస్తోంది. హను రాఘవపూడి సినిమాతో పాటు స్పిరిట్ సినిమాని కూడా ఒకే సమయంలో షూట్ చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు. హను రాఘవపూడి సినిమా ఒక పీరియాడిక్ డ్రామా కాగా ఈ సినిమా కోసం ప్రభాస్ ఎక్కువ డేట్లు కేటాయించాడు. ఫౌజి సినిమాలో ప్రభాస్ సరసన మృణాల్ ఠాకూర్ ని హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1940ల బ్యాక్ డ్రాప్లో బ్రిటిష్ కాలం నాటి సినిమాగా దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రభాస్ ఈ సినిమాలో ఒక జవాన్ పాత్రలో నటిస్తూ ఉండగా మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది.