No Update for SSMB 29 on Mahesh Babu Birthday: సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ తో కలిసి చేసిన గుంటూరు కారం సినిమా మిశ్రమ స్పందన అందుకుంది. ఈ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు తన 29వ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా పూర్తిస్థాయిలో రాలేదు. కేవలం రాజమౌళికి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా కేఎల్ నారాయణ నిర్మాణంలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద ఒక సినిమా తెరకెక్కబోతోంది అని వార్త మాత్రమే అధికారికంగా బయటకు వచ్చింది. ఈ సినిమాకి కథ అందించే విజయేంద్ర ప్రసాద్ సినిమా కథ గురించి పలుచోట్ల పలు సందర్భాలలో పలు విధాలుగా కామెంట్లు చేశారు. కానీ రాజమౌళి నోటి నుంచి రాకుండా ఏది అధికారికం కాదనే చెప్పాలి. ఈ నేపద్యంలోనే మరికొద్ది రోజుల్లో రాబోతున్న మహేష్ బాబు పుట్టినరోజు ఆగస్టు 9వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన కానీ లేదా సినిమాకి సంబంధించిన ఏదో ఒక ప్రకటన ఉండబోవచ్చు అని కొద్ది రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
Pushpa 2 : బన్నీ – సుక్కు మధ్య వివాదం.. అసలు విషయం చెప్పిన టీం మెంబర్!!
అయితే మహేష్ బాబు అభిమానులందరూ నిరాశపడే విధంగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల నుంచి ఒక షాకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అదేమంటే ఈసారి మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ అయితే బయటకు రావడం లేదని తెలుస్తోంది. కాబట్టి మహేష్ బాబు అభిమానులు ఎక్కువ ఆశలు పెట్టేసుకొని సినిమా నుంచి అప్డేట్ వస్తుందని రెడీగా ఉంటే మాత్రం నిరాశ పడక తప్పదని చెబుతున్నారు. ఇక మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్లో క్లాసిక్ హిట్ గా నిలిచిన మురారి సినిమాని రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది కూడా.