ధనుష్ కెరీర్ లో 50వ సినిమాగా వచ్చిన చిత్రం ‘రాయన్’. ఈ చిత్రానికి ధనుష్ కథ, స్క్రీన్ ప్లే తో పాటు తానే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించాడు. జులై 26న విడుదలైన రాయన్ ప్రేక్షకులను, అభిమానులని విశేషంగా ఆకట్టుకుంటుంది. అటు తమిళ్ తో పాటు తెలుగు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. విడుదలైన నాటి నుండి సూపర్ హిట్ టాక్ తో థియేటర్లలోసందడి చేస్తోంది.
కాగా ఈ చిత్రం రిలీజ్ కేవలం 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 105.38 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. వందకోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా పలు రికార్డులు తన పేరిట నమోదు చేసాడు ధనుష్. ఇండియన్ బాక్సఫీస్ చరిత్రలో ‘A’ రేటింగ్ సినిమా వంద కోట్లు సాధించిన సినిమాల సరసన 3వ స్థానంలో నిలిచింది. అటు తమిళ్ లో మొట్టమొదటి 100 కొట్ల రూపాయల ‘A’ రేటింగ్ తో కలిగిన సినిమాగా రాయన్ నిలిచింది. దానితో పాటుగా కోలీవుడ్ సెకండ్ 100 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిన సినిమా కూడా రాయన్ మాత్రమే.
‘రాయన్’ తెలుగులోను అద్భుతంగా రాణిస్తోంది. రూ.2.1 కోట్లకు థియేట్రికల్ కొనుగోలు చేయగా 4 రోజుల్లో ఈ సినిమా రూ.4.05 కోట్ల షేర్ ను రాబట్టింది.ఫస్ట్ వీకెండ్ లోనే బ్రేక్ ఈవెన్ సాధించి రూ 2 కోట్లు లాభాలు తెచ్చి పెట్టింది. ఆగస్టు 15వరకు పెద్ద సినిమాలు ఏవి లేకపోవడం రాయన్ కు ప్లస్ పాయింట్. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ బాబు రాయన్ ను వీక్షించి ధనుష్ మరియు టీమ్ మొత్తానికి విషెస్ తెలిపారు.
Also Read: Niharika: నిహారిక సినిమాకు అదిరే ఆఫర్.. థియేట్రికల్ రైట్స్ డీల్ క్లోజ్..