చాల కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న సన్నీ డియోల్ ఒకప్పటి తన సూపర్ హిట్ సినిమా గద్దర్ కు సీక్వెల్ గా గద్దర్ – 2 తో రీ ఎంట్రీ ఇచ్చాడు. రీఎంట్రీ లో సన్ని డియోల్ అదరగొట్టాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద గద్దర్ -2 సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ సాధించింది. ఆ ఉత్సహంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సన్నీ డియోల్. అందులో భాగంగా టాలీవుడ్ దర్శకుడు గోపించంద్ మలినేని దర్శకత్వంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ఈ బాలీవుడ్ హీరో.
Also Read : Vikram Prabhu : ఆహాలో స్ట్రీమింగ్ కు వచ్చేసిన థ్రిల్లర్ ‘రైడ్’..
SDGM వర్కింగ్ టైటిల్ తో ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా గోపిచంద్ మలినేనికి మొదటి బాలీవుడ్ సినిమా. వీరసింహ రెడ్డి హిట్ తో సూపర్ ఫామ్ లో ఉన్న దర్శకుడు గోపీచంద్ మలినేని. ఎలాగైనా హిట్ కొట్టి బాలీవుడ్ హీరోలతో వరుస సినిమాలు చేయాలని పట్టుదలగా ఉన్నాడు. తాజగా సన్నీ డియోల్ తో చేస్తున్న ఈ సినిమాకు ” JAAT ” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. సన్నీ డియోల్ పుట్టిన రోజు కానుకగా ఆయనకు విషెష్ తెలియజేస్తూ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. అలాగే సాయంత్రం 4.05 మోషన్ పోస్టర్ వీడియో ను రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాకు టాలీవుడ్ సెన్సేషన్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీస్ బ్యానర్ మరియు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి ఎలమంచిలి, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు.