ఇద్దరు సెన్సేషనల్ హీరోయిన్‌ల మధ్య పోటీ మొదలైంది. ఒకరూ సీనియర్ హీరోలను లైన్ లో పెడుతుంటే.. మరొకరు యంగ్ హీరోలను చుట్టేస్తున్నారు. ఇంతకి ఎవ్వర ముద్దుగుమ్మలు అంటే మమితా బైజు, కయాద్ లోహార్ . ఎప్పటి నుండో ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.. ఒక్క ఛాన్స్ తో ఈ హీరోయిన్ల కెరీర్ మారిపొయింది. వారిని రాత్రికి రాత్రే స్టార్లను చేసేస్తుంది. లాస్ట్ ఇయర్ ‘ప్రేమలు’ మూవీతో మమితా బైజు సెన్సేషనల్ హీరోయిన్ అయితే.. రీసెంట్ గా ‘డ్రాగన్’ మూవీతో కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిపోయిన కయాద్ లోహార్ ఇంకొక్కరు. అయితే వీరిద్దరి పేర్లు మారుమ్రోగుతున్నాయి.
Also Read : Bhargavi : యూట్యూబ్ ఛానల్స్ థంబ్‌నెయిల్‌పై మండిపడిన నటి భార్గవి
‘ప్రేమలు’ తో భారీ విజయం అనుకున్న మమిత ఎప్పుడైతే ‘జననాయగన్’లో సెలెక్ట్ అయ్యిందో.. వరుసగా సీనియర్ హీరోలతో నటించే ఛాన్స్ కొట్టెస్తోంది. ఇప్పటికే విష్ణు విశాల్ ‘ఇరండు వానమ్’ అనౌన్స్ చేయగా.. ధనుష్, సూర్యతో నటించబోతుందట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య 46 గా తెరకెక్కబోతున్న సినిమాలో ఈ మలయాళ బ్యూటీ కన్ఫమ్ అయ్యిందని కోలీవుడ్ సర్కిల్స్ లో బజ్ నడుస్తోంది. అలాగే హీరో ప్రదీప్ రంగనాథన్‌తో నటించే ఛాన్స్ కూడా అందుకునట్లు తెలుస్తోంది.
ఇక ‘డ్రాగన్’ తో కుర్రాళ్ల నయా క్రష్‌గా మారిపొయిన బ్యూటీ కయాద్. ప్రజంట్ ఆమె కూడా బిగ్ ఆఫర్లను పట్టేస్తోంది. ఇదయం మురళిలో అధర్వతో పాటు, మలయాళ యంగ్ హీరో నివిన్ పౌలీతో తారం, కాళిదాస్ నిలవరుమ్ వేలయ్ , తెలుగులో విశ్వక్ సేన్‌తో నటించే అవకాశాలను దక్కించుకుందట. ఇవే కాకుండా రవితేజ- కిషోర్ తిరుమల కాంబోలో మూవీ, శింబు 49 ప్రాజెక్టులో ఈ భామనే హీరోయిన్ అని తెలుస్తోంది. దీంతో సోషల్ మీడియాలో మమితా వర్సెస్ కయాద్ లోహార్ ఫ్యాన్ వార్ స్టార్ట్ అయ్యింది. ఈ ఇద్దరినీ ఒకరితో ఒకరిని పోలుస్తూ.. డై హార్ట్ ఫ్యాన్స్ హంగామా సృష్టిస్తున్నారు. మరీ నిజంగానే ఈ ఇద్దరు నియర్ ఫ్యూచర్‌లో కాంపిటీషన్ అయిపోతారా..? చూద్దాం.