‘పుష్ప 2’ మూవీతో బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో మనకు తెలిసిందే. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టాడు.ఉహించని స్థాయిలో ఈ మూవీ కలెక్షన్‌లను రాబట్టింది. ఇక దాదాపు మూడేళ్లుగా ఈ మూవీనే ప్రపంచం అన్నట్టు తిరుగుతూ వచ్చిన అల్లు అర్జున్ కి .. ఇప్పుడు కొంచెం ఫ్రీ టైం దొరికింది. అయితే ‘పుష్ప 2’ సెట్స్ పై ఉండగానే తన నెక్స్ట్ సినిమా త్రివిక్రమ్ తో చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ‘పుష్ప 2’ పూర్తికాగానే అల్లు అర్జున్ చేసే సినిమా ఇదే అని అంతా అనుకున్నారు.కానీ అనుకోకుండా మధ్యలో కోలివుడ్ స్టార్ దర్శకుడు అట్లీ వచ్చాడు.
ఇందుకు ఒక్కింత త్రివిక్రమ్‌మే కారణం అంటా. ఎందుకంటే త్రివిక్రమ్ స్క్రిప్ట్ భారీ బడ్జెట్ తో కూడినది.. ఇందులో మైథలాజి టచ్ కూడా ఉంటుందట సో.. అనుకున్న సబ్జెక్టులకు ప్రాపర్‌గా, కథ లేకుంగా సినిమా సెట్స్ పైకి వెలితే బడ్జెట్ విషయంలో తేడా రావోచ్చు.అందుకే టైం తీసుకున్నాడట మాటల మాంత్రికుడు. దీంతో అట్లీతో అల్లు అర్జున్ మూవీ లైన్ లోకి వచ్చింది. అట్లీతో సినిమా చేయాలని అల్లు అర్జున్ చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నాడు. కానీ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల డిలే అవుతూ వస్తోంది.
అయితే ఈ మూవీలో హీరోయిన్ గురించి చాలా వార్తలు వైరల్ అవుతున్నాయి. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్‌ని అట్లీ ఓకే చేశాడట. బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్‌ని బన్నికి జోడిగా ఫిక్స్ చేశాడట అట్లీ. ఈ వార్త ఎప్పటి నుంచో వినిపిస్తున్నప్పుడు క్లారిటీ లేదు.. కాగా ఇప్పుడు సమాచారం ప్రకారం అట్లీ, జాన్వీని ఓకే చేశాడట. త్వరలోనే ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రాబోతుంది.