వర్సటైల్ ఆర్టిస్ట్ సత్యదేవ్ పుట్టినరోజు ఇవాళ. అతను నటిస్తున్న పలు చిత్రాల షూటింగ్స్ వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘ఘాజీ’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సత్యదేవ్ తాజాగా అక్షయ్ కుమార్ ‘రామ్ సేతు’ హిందీ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అలానే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’లో కీరోల్ ప్లే చేస్తున్నాడు. ఇక కొరటాల శివ సమర్పణలో నిర్మితమౌతున్న ‘కృష్ణమ్మ’ చిత్రంలోనూ సత్యదేవే హీరో.
read also: Somu Veerraju : దుష్టశక్తులు భారీ కుట్ర పన్నాయి..
ఇదిలా ఉంటే… ఇప్పటికే సత్యదేవ్, తమన్నా, కావ్య శెట్టి, మేఘా ఆకాష్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించిన ‘గుర్తుందా శీతాకాలం’ విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను జూలై 15న విడుదల చేస్తామని ఆ మధ్య నిర్మాతలు తెలిపారు. బట్ ఇవాళ సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన స్పెషల్ పోస్టర్ ద్వారా మూవీ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఈ ఫీల్ గుడ్, రొమాంటిక్ మూవీని ఆగస్ట్ 5న విడుదల చేయబోతున్నారు. అయితే… అదే రోజున కళ్యాణ్ రామ్ ‘బింబిసార’, దుల్కర్ సల్మాన్ ‘సీతారామం’ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరి ఈసారి అయిన వాయిదా వేయకుండా అదే రోజున ‘గుర్తుందా శీతాకాలం’ను రిలీజ్ చేస్తారేమో చూడాలి.