తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ సహా మరో స్టార్ హీరో బాలకృష్ణను హత్తుకున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ రోజు హైదరాబాద్ వేదికగా గద్దర్ తెలంగాణ ఫిలిం అవార్డులను ప్రభుత్వం అందజేస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి దాదాపుగా రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ ఒకే సమయంలో చేరుకున్నారు.
Also Read:Kannappa Trailer Review : కన్నప్ప ట్రైలర్ రివ్యూ.. యాక్షన్, డివోషన్..!
అనంతరం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నవారందరినీ పలకరిస్తూ వస్తున్న క్రమంలో నందమూరి బాలకృష్ణను చూసి ఆయనను హత్తుకున్నారు. పక్కనే ఉన్న అల్లు అర్జున్‌ను చూసి ఆయనను కూడా హత్తుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. పుష్ప రిలీజ్ సమయంలో అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో అనేక ప్రచారాలు జరిగాయి. ఇక ఇప్పుడు ఒక హగ్‌తో ఆ ప్రచారాలన్నింటికీ బ్రేకులు వేసినట్లయింది. ఇక పుష్ప సినిమాకు గానూ అల్లు అర్జున్ 2024 సంవత్సరానికి బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోబోతున్నారు.