Four Arrested in Guntur Kaaram Negative Publicity Case: మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం అనే సినిమా సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూస్ వచ్చాయి. కొంతమంది సినిమా బాగుందంటే కొంతమంది మాత్రం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదని కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా మీద కావాలని బుక్ మై షో వేదికగా కొంతమంది నెగటివ్ రేటింగ్స్ ఇచ్చారని చెబుతూ సినిమా టీం బుక్ మై షో సంస్థను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అంతేగాక హైదరాబాద్లోని సైబర్ క్రైమ్ పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు ఆ మధ్య ప్రచారం జరిగింది. ఇక తాజాగా ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
Tollywood Drugs: బిగ్ బ్రేకింగ్: డ్రగ్స్ కేసులో తెలుగు హీరో ప్రియురాలు అరెస్ట్?
ప్రాథమిక విచారణ అనంతరం ఈ నలుగురు కావాలని గుంటూరు కారం సినిమాకి నెగిటివ్గా రేటింగ్స్ ఇవ్వడం, నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేయడం వంటివి చేస్తున్నారని గుర్తించినట్లు తెలుస్తోంది. ఎవరో కావాలనే తమ సినిమా మీద ఇలా నెగిటివ్ ప్రోపగాండా చేసినట్లు ముందు నుంచి టీం భావిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలోనే సైబర్ క్రైమ్ టీంతో పాటు బుక్ మై షో నిర్వాహకులను కూడా ఈ విషయంలో దృష్టి పెట్టాల్సిందిగా కోరింది. ఇక మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, జగపతిబాబు, సునీల్, జయరాం, ప్రకాష్ రాజు, రావు రమేష్, రాహుల్ రవీంద్రన్, ఈశ్వరి రావు వంటి వారు ఈ సినిమాలో ఇతర కీలక పాత్రలలో కనిపించారు. ఈ సినిమా వారం రోజుల్లో 212 కోట్ల రూపాయల కలెక్ట్ చేసినట్లుగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఆ తర్వాత ఎంత కలెక్షన్స్ వచ్చాయనే విషయం మీద అధికారిక ప్రకటన అయితే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు.