Tollywood Hero Lover Arrested under NDPS Act: హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడం మరింత ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్లోని నార్సింగిలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. హైదరాబాద్ పోలీసులు ఒక లావణ్య అనే యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ పోలీసులు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో నాలుగు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ ని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
Viswambhara: సంక్రాంతిపై కన్నేసిన బాసు.. రిలీజ్ డేట్ ఫిక్స్?
సదరు యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తించారు. ప్రస్తుతానికి ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ ఎండీఎంఏ డ్రగ్స్ ని గోవా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టాలీవుడ్ హీరోకి ఆమె ప్రేయసి అని పోలీసుల నుంచి సమాచారం లీక్ కావడంతో అసలు ఆమె ఎవరు? ఏ తెలుగు హీరోకి ఆమె ప్రేయసి? అనే విషయం మీద చర్చ జరుగుతోంది. నిజానికి కొన్నాళ్ల క్రితం వరకు హైదరాబాదులో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని లింకులు వాటి తిరిగి టాలీవుడ్ పరిశ్రమకు లీడ్ అవుతూ ఉండేవి. ఇప్పుడు కూడా మరోసారి టాలీవుడ్ హీరో ప్రేయసి పేరుతో మరోసారి లింక్ తెలుగు సినీ పరిశ్రమకే ఏర్పడడం గమనార్హం.