SSMB-29: ఇప్పుడు టాలీవుడ్ లో ఎస్ ఎస్ ఎంబీ-29 గురించే చర్చ జరుగుతోంది. రాజమౌళి కెరీర్ లో మొదటిసారి ఆయన సినిమా షూటింగ్ వీడియో లీక్ అయింది. ఈ ఎఫెక్ట్ తో షూటింగ్ స్పాట్ లో సెక్యూరిటీని టైట్ చేశారంట. ఒక్క చిన్న క్లిప్ కూడా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ వీడియో లీక్ అయినప్పటి నుంచి కథ ఇదే అంటూ నానా రకాలుగా ప్రచారం చేస్తున్నారు. కొందరేమో గుప్త నిధుల కోసం మహేశ్ బాబును విలన్ అడవులకు పంపిస్తాడని అంటున్నారు. అందుకే విలన్ ముందు అలా మోకరిల్లాడంటూ ప్రచారం చేస్తున్నారు. కానీ అసలు కథ వేరే ఉన్నట్టు తెలుస్తోంది. ఈ కథ కాశి నుంచి మొదలై చివరకు అడవులకు చేరుకుంటుందంట. మొన్న హైదరాబాద్ లో కాశి సెట్ కు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Read Also: Pushpa 2 Stampede: ఆ బాలుడు ఎవరినీ గుర్తు పట్టలేడు.. మాటలు అర్థం కావు!
అక్కడే కథకు మూలం ఉందంట. హైదరాబాద్ లోని మణికర్ణికా ఘాట్ కు కాశి సెటప్ కు లింక్ ఉంది. అందుకే మణికర్ణికా ఘాట్ వద్ద ఈ కాశి సెటప్ వేసినట్టు తెలుస్తోంది. ఈ కాశి సెట్ దాదాపు పూర్తి అయింది. త్వరలోనే ఇందులో షూటింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ కాశి నుంచి మహేశ్ అడవులకు ఎందుకు వెళ్తాడనేది కీలకమైన ఫ్లాష్ బ్యాక్ లో చూపిస్తారంట. రామాయణంలో హనుమంతుడి పాత్రను స్ఫూర్తిగా తీసుకుని విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాసుకున్నట్టు సమాచారం. రాముడి కోసం హనుమంతుడు అడవుల్లో సంచరిస్తాడు. అడవులను, సముద్రాలను దాటుకుంటూ సీతమ్మ జాడ కోసం వెళ్తాడు. ఈ కథలో కూడా మహేశ్ బాబు ఇచ్చిన మాట కోసమే అడవుల బాట పడుతాడని తెలుస్తోంది.
Read Also: Ranya Rao: పెళ్లైన రెండు నెలల నుంచే.. భర్త ఫిర్యాదుతో అడ్డంగా బుక్కైన నటి
హనుమంతుడు ఎంత బలవంతుడో.. ఈ కథలో కూడా మహేశ్ పాత్రను అంత బలవంతుడిగా డిజైన్ చేశారంట. ఇచ్చిన మాట కోసం కట్టుబడే హనుమంతుడిలా మహేశ్ చేసే పోరాటాలు అబ్బురపరుస్తాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఒరిస్సాలో షూటింగ్ జరుగుతోంది. అది అయిపోయిన తర్వాత హైదరాబాద్ లో షూట్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.