ఈ 2024వ సంవత్సరంలో సినీ పరిశ్రమకు చెందిన ముఖ్యమైన ఘట్టాలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఫిబ్రవరి నెల విషయానికి వస్తే
ఫిబ్రవరి 1: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. మొత్తం 12 కేసుల్లో ఆరు కేసులు డిస్మిస్ చేశారు. ఎన్.డి.పి.ఎస్. ప్రొసీజర్ ను ఎక్సైజ్ అధికారులు పాటించలేదని కారణంగా, ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ రిపోర్ట్ లో సెలబ్రిటీస్ డ్రగ్స్ తీసుకున్న ఆనవాళ్ళు లేని కారణంగా రవితేజ, తరుణ్, పూరి జగన్నాథ్ తో పాటు మిగిలిన సినీ ప్రముఖుల మీద కేసులు డిస్మిస్ చేశారు.
ఫిబ్రవరి 2: తమిళ స్టార్ హీరో విజయ్ ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు.
ఫిబ్రవరి 3: సర్వైకల్ క్యాన్సర్ తో తాను చనిపోయానంటూ రెండు రోజుల ముందు వచ్చిన వార్తల్లో నిజం లేదని, ప్రజలలో ఈ క్యాన్సర్ పై అవగాహన కలిగించడానికి ఇలాంటి వార్త సృష్టించానని పూనమ్ పాండే తెలిపింది.
ఫిబ్రవరి 4. పద్మ అవార్డు గ్రహీతలను తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది.
ఫిబ్రవరి 5: 2024కి గానూ ఐదుగురు భారతీయ కళాకారులు, గాయకులు గ్రామీ అవార్డులు గెలుచుకున్నారు. తబలా కళాకారులు జాకీర్
హుస్సేన్, వేణుగాన విద్వాంసుడు రాకేష్ చౌరాసియా, గాయకుడు శంకర్ మహదేవన్, వయోలిన్ కళాకారుడు గణేశ్ రాజగోపాలన్, డ్రమ్స్ కళాకారుడు సెల్వ గణేశ్ వినాయక్ రామ్ అవార్డులను గెలుచుకున్నారు.
ఫిబ్రవరి 5: దర్శకుడు వశిష్ట ఆడబిడ్డకు తండ్రయ్యాడు.
ఫిబ్రవరి 6: వ్యాపారవేత్త భరత్ తో 12 సంవత్సరాల వైవాహిక జీవితానికి వీడ్కోలు పలుకుతున్నట్లు ధర్మేంద్ర, హేమమాలిని కుమార్తె ఇషా
డియోల్ తెలిపింది. వీరికి ఇద్దరు పిల్లలు.
ఫిబ్రవరి 10: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా మురళీమోహన్ నట స్వర్ణోత్సవం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో ఘనంగా జరిగింది.
ఫిబ్రవరి 11: తెలుగు దర్శకుల సంఘానికి జరిగిన ఎన్నికల్లో వీర శంకర్ ప్యానల్ ఘన విజయం సాధించింది.
ఫిబ్రవరి 13: తమిళ నటుడు అజిత్ స్నేహితుడు, ‘ఎండ్రావత్తు ఒరునాల్’ చిత్ర దర్శకుడు వెట్రి దొరై సామి (45) డెడ్ బాడీ సట్లేజ్ నదిలో దొరికింది. ఆరోజుకు తొమ్మిది రోజుల క్రితం ఆయన ప్రయాణిస్తున్న కారు సిమ్లా దగ్గర నదిలో పడిపోయింది.
ఫిబ్రవరి 14: బీజేపీ నుంచి బయటకు వచ్చిన గౌతమి, అన్నాడీఎంకే పార్టీలో చేరారు.
ఫిబ్రవరి 14: యువ హీరో, నిర్మాత దిల్ రాజు తమ్ముడు శిరీష్ తనయుడు ఆశిష్ రెడ్డికి విజయవాడకు చెందిన ఆద్వితా రెడ్డితో జైపూర్ లోని లీలా ప్యాలెస్ లో డెస్టినేషన్ వెడ్డింగ్ జరిగింది.
ఫిబ్రవరి 15: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ భార్య, యోగా టీచర్ అయిన రుహి నాజ్ అనారోగ్యంతో కన్నుమూశారు.
ఫిబ్రవరి 15: విరాట్ కోహ్లీ , అనుష్క దంపతులకు రెండో సంతానంగా మగ బిడ్డ పుట్టగా, అకాయ్ అనే పేరు పెట్టారు. వీరికి వామికా అనే పాప కూడా ఉంది.
ఫిబ్రవరి 16: ‘దంగల్’ సినిమాలో అమీర్ ఖాన్ చిన్న కూతురిగా నటించిన సుహానీ భట్నాగర్ (19) అనారోగ్యంతో కన్నుమూసింది.
ఫిబ్రవరి 17: ప్రముఖ రచయిత, హిందీ గీత రచయిత గుల్జార్ కు జ్ఞానపీఠ అవార్డ్ వచ్చింది.
ఫిబ్రవరి 18: స్టార్ డైరెక్టర్ శంకర్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లికి సిద్ధమవగా అసిస్టెంట్ డైరెక్టర్ తరుణ్ కార్తికేయన్ తో వివాహ నిశ్చితార్థం జరిగింది.
ఫిబ్రవరి 18: దేవోంకే మహాదేవ్ సీరియల్ లో పార్వతీదేవిగా నటించిన సోనారికా బడోరియా బిజినెస్ మ్యాన్ వికాస్ పరాశర్ ను పెళ్ళాడింది. తెలుగులో సోనారిక ‘జాదూగాడు, స్పీడున్నోడు, ఈడోరకం ఆడోరకం’ సినిమాలలో హీరోయిన్ గా నటించింది.
ఫిబ్రవరి 18: బాలీవుడ్ నటుడు రుతురాజ్ సింగ్ (59) గుండెపోటుతో కన్నుమూశారు.
ఫిబ్రవరి 19: బాలీవుడ్ నటుడు సాహిత్ ఖాన్ 47 ఏళ్ళ వయసులో 21 సంవత్సరాల అమ్మాయిని పెళ్ళాడాడు.
ఫిబ్రవరి 19: ప్రముఖ మలయాళ నటుడు సుదేవ్ నాయర్ తన ప్రియురాలు అమర్ దీప్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు. సుదేవ్ నాయర్
తెలుగులో ‘’టైగర్ నాగేశ్వరరావు, ఎక్స్టార్డినరీ మ్యాన్’ చిత్రాలలో నటించాడు.
ఫిబ్రవరి 21: తెలుగు హీరో నితిన్ మగబిడ్డకు తండ్రి అయ్యాడు.
ఫిబ్రవరి 21: ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీతో గోవాలో జరిగింది.
ఫిబ్రవరి 21: దేవి శ్రీ ప్రసాద్ తమ్ముడు, ప్రముఖ సింగర్ సాగర్ మగబిడ్డకు తండ్రి అయ్యాడు.
ఫిబ్రవరి 22: ప్రముఖ యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి కేసులో అరెస్ట్ అయ్యాడు.
ఫిబ్రవరి 26: ‘యువత’, ‘కందిరీగ’ తదితర చిత్రాల్లో నటించిన అక్ష పార్ధసాని సినిమాటోగ్రాఫర్ కౌశల్ ను వివాహం చేసుకుంది.