యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు హరీశ్ శంకర్‌తో కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కింగ్డమ్ సినిమాతో తన కెరీర్‌కు మంచి స్థానం సొంతం చేసుకున్న విజయ్‌కు ఈ ప్రాజెక్ట్ పై అనేక మంది ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హరీశ్ శంకర్‌తో సినిమా చేయడం వల్ల మీ కెరీర్ స్మాష్ అవుతుంది అని అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read : Mahavatar : ఇంట్లో కూర్చొని 1000 కోట్లు కలెక్ట్ చేసే సినిమా తీయొచ్చు – దర్శకుడు అశ్విన్ కుమార్
హరీశ్ శంకర్ గతంలో గబ్బర్ సింగ్ తర్వాత పలు పెద్ద హిట్ సినిమాలు లేవు. సాయి ధరం తేజ్‌తో చేసిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ గరిష్ట విజయం అయినప్పటికీ, ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘మిస్టర్ బచ్చన్’ వంటి సినిమాలు భారీ డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ నేపథ్యంలో హరీశ్ శంకర్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తే అది కూడా ఫ్లాప్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు.. ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని, తన కెరీర్ నాశనం కాకుండా జాగ్రత్తగా ఉండాలని గట్టిగానే కోరుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా ప్రాజెక్ట్ గురించి అధికారిక ప్రకటనలు వెలువడలేదు, కానీ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ ఈ సినిమా నిర్మాణంలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అధికారిక సమాచారం వచ్చే వరకు హిట్ ఫట్ మీద అంచనాలు వేయడం త్వరలోనే నిర్ణయిస్తాం అని సినీ వర్గాలు అంటున్నాయి.