నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతున్న హీస్ట్ యాక్షన్ కామెడీ చిత్రం రాబిన్‌హుడ్ ట్రైలర్ విడుదలలో ఊహించని ఆటంకం ఎదురైంది. మొదట మార్చి 21, 2025 సాయంత్రం 4:05 గంటలకు థియేటర్‌లో ఘనంగా ట్రైలర్ ఆవిష్కరణ జరపాలని ట్విట్టర్ ఏఐ గ్రోక్ పెట్టిన ఒక ముహూర్తానికి షెడ్యూల్ చేసినప్పటికీ, థియేటర్లో ఈవెంట్ కోసం అనుమతులు రాకపోవడంతో ఈ ఈవెంట్ వాయిదా పడింది. ఈ ఈవెంట్ ను బాలానగర్ మైత్రీ విమల్ థియేటర్లో నిర్వహించాలని అనుకున్నారు. అయితే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఇక తాజా సమాచారం ప్రకారం, రాబిన్‌హుడ్ ట్రైలర్ ఇప్పుడు మార్చి 23, 2025న జరగనున్న గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఫంక్షన్‌లో విడుదల కానుంది.
Nithin : అది నాకు తెలియకుండా జరిగింది.. కాంట్రవర్సీపై నితిన్..
ఈ మార్పుపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముట్టంశెట్టి మీడియా బ్యానర్‌లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం, మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. నితిన్ హీరోగా రూపొందిన ఈ సినిమా, వెంకీ కుదుముల ట్రేడ్‌మార్క్ హాస్యంతో పాటు ఉత్కంఠభరిత యాక్షన్‌ను అందించనుందని అంచనా. ట్రైలర్ వాయిదా పడినప్పటికీ, అభిమానుల ఆసక్తి మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇక ఈ వాయిదా సమాచారాన్ని కూడా నితిన్, వెంకీ ఇద్దరూ గ్రోక్ తో సరదాగానే వీడియో చేసి రిలీజ్ చేయడం గమనార్హం.