Nithin : నితిన్ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా చేస్తున్న తాజా మూవీ రాబిన్ హుడ్. సూపర్ హిట్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ నుంచి వచ్చిన అడిదా సర్ ప్రైజ్ ఐటెం సాంగ్ ఎంత క్రేజ్ సంపాదించిందో అంతే విమర్శలు కూడా వస్తున్నాయి. మరీ ముఖ్యంగా కేతిక శర్మ వేసిన స్టెప్పులు కొంచెం ఇబ్బంది కరంగానే ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయి. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైమ్ లో ఈ కాంట్రవర్సీ మీద హీరో నితిన్ స్పందించారు.
Read Also : Allu Arjun – Atlee: అల్లు అర్జున్ – అట్లీ సినిమా.. ఆ వార్తల్లో నిజం లేదా?
తాజాగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆ సాంగ్ జరిగినప్పుడు నేను సెట్స్ లో లేను. అది నాకు తెలియకుండానే జరిగింది. తెలిసి జరిగినా.. తెలియకుండా జరిగినా దానికి రెస్పాన్సిబిలిటీ మా మూవీ యూనిట్ మొత్తం తీసుకుంటాం. ప్రశంసలు, విమర్శలను సమానంగా తీసుకుంటాను. నేను సినిమా చూశాను. మూవీ బాగా వచ్చిందనే సంతోషంలో ఆ సాంగ్ స్టెప్పులను నేను మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ట్రోల్స్ చూసి అబ్జర్వ్ చేశాను. ఏది జరిగినా చివరకు మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. సినిమా పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నా’ అన్నారు. నితిన్ కు వరుస ప్లాపుల తర్వాత ఈ సినిమాతో మంచి హైప్ వచ్చింది. ఈ మూవీ ఎలాగైనా హిట్ కావాలని ఆయనతో పాటు శ్రీలీల కోరుకుంటున్నారు.