దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా బిజీగా మారిపోయిన రష్మిక మందన్న ఈ కరోనా కాలంలో తరచుగా సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. తన అభిమానులతో ఇంటరాక్ట్ అయ్యి వారి సందేహాలను తీరుస్తోంది. అందులో భాగంగా తాజాగా అభిమానులతో ముచ్చటించిన రష్మిక సరైన స్క్రిప్ట్, సమర్థుడైన దర్శకుడు దొరికితే మళ్ళీ విజయ్ దేవరకొండతో కలిసి పని చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన అభిమాన ఐపిఎల్ జట్టు అని రష్మిక అన్నారు. తన లవ్ లైఫ్ గురించి మాట్లాడుతూ… ప్రస్తుతం సినిమానే తన బాయ్ ఫ్రెండ్ అని, ఇప్పుడు రొమాంటిక్ రిలేషన్స్ కు అంత సమయం లేదని చెప్పారు. ‘పుష్ప’ గురించి మాట్లాడుతూ ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని తెలిపారు. నా తదుపరి విడుదల ఎప్పుడో నాకు తెలియదు. కరోనా నుంచి పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అందరూ వేచి ఉండాలి. అప్పుడే కొత్త సినిమాల విడుదల గురించి మాట్లాడగలం అని చెప్పుకొచ్చింది. కాగా రష్మిక ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంది.