తాజాగా టాలీవుడ్ దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి కన్నుముశారు . గత రాత్రి (జూన్ 10వ తేదీ) కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి. అయితే ఏఎస్ రవికుమార్ చౌదరి కొన్ని రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నట్లు సమాచారం. దర్శకుడిగా ఆయన చేసిన చివరి సినిమాలు, వరుస పరాజయాల పాలు కావడం వల్ల మానసికంగా ఒత్తిడికి లోనయ్యారట, మరోవైపు ఇండస్ట్రీలో సన్నిహితులు దూరం కావడం కూడా, ఆయన మీద ప్రభావం చూపించిందట. ఏదేమైనప్పటికి ఇండస్ట్రీలో మరో దర్శకుడిని కొల్పోయింది.
Also Read : Kangana : హనీమూన్‌లో భర్తని చంపిన భార్య కేస్ పై.. రియాక్ట్ అయిన కంగనా రనౌత్..
ఇక గోపీచంద్ కథానాయకుడిగా ఈ తరం ఫిలిమ్స్ పతాకం మీద పోకూరి బాబూరావు నిర్మించిన ‘యజ్ఞం’ మూవీ తో దర్శకుడిగా పరిచయం అయ్యారు రవికుమార్ చౌదరి. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తరువాత బాలకృష్ణతో ‘వీరభద్ర’ సినిమా చేసే అవకాశం అందుకున్నాడు. అయితే అది ఆశించిన ఫలితం ఇవ్వలేదు. అనంతరం నితిన్ తో చేసిన ‘ఆటాడిస్తా’ కూడా డిజాస్టర్ అయ్యింది. ఆ తరువాత ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ కాస్త ఊరట ఇచ్చింది. యువ హీరో సాయి దుర్గా తేజ్ తో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ కూడా పర్వాలేదు అనిపించిది.