తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాతగా గుర్తింపు పొందిన దిల్ రాజు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సారి ఆయన నిర్మించనున్న చిత్రంలో ‘కోర్టు’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హీరో హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించనున్నారు. అలాగే, సీనియర్ నటుడు శివాజీ ఈ సినిమాలో ఒక కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. ఈ చిత్రానికి కొత్త దర్శకుడు రమేష్ రూపకల్పన చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి టైటిల్‌గా ‘తెల్ల కాగితం’ అనే పేరును పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మొన్ననే విడుదలైన ‘కోర్టు: స్టేట్ వర్సెస్ ఎ నోబడీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన యువ నటుడు హర్ష్ రోషన్, తన సహజమైన నటనతో అందరి ప్రశంసలు అందుకున్నారు. ఈ చిత్రంలో రోషన్ చేసిన చందు పాత్ర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ విజయంతో రోషన్ కు వరుస అవకాశాలు రాగా, దిల్ రాజు వంటి పెద్ద నిర్మాత నుంచి ఆఫర్ రావడం ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా చెప్పవచ్చు.
Beggar: పూరీ – విజయ్ సేతుపతి ‘బెగ్గర్’ను వదలని ఛార్మి?
ఈ కొత్త చిత్రంలో రోషన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇక ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించిన శివాజీ, ‘కోర్టు’ సినిమాలో మంగపతి అనే విలన్ పాత్రలో తన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఆ పాత్రలో నటనా చాతుర్యం ఆయనకు విమర్శకుల ప్రశంసలు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు ఈ కొత్త చిత్రంలోనూ శివాజీ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనున్నారు. ఈ పాత్ర కథలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంటుంది, రోషన్‌తో ఆయన స్క్రీన్ షేర్ ఎలా ఉంటుందనే దానిపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్న రమేష్ ఒక కొత్త దర్శకుడు కావడం విశేషం. దిల్ రాజు గతంలోనూ కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన సంగతి తెలిసిందే.