తెలుగు సినిమా పరిశ్రమలో మాస్ డైరెక్టర్‌గా పేరొందిన పూరీ జగన్నాధ్, తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతితో కలిసి ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఇటీవల కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. పూరీ సొంత నిర్మాణ సంస్థ ‘పూరీ కనెక్ట్స్’ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుందని, ఇందులో ఛార్మి కౌర్ నిర్మాతగా వ్యవహరించనుందని సమాచారం. గతంలో ఈ సినిమా నిర్మాణంలో ఛార్మి ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా జరుగుతుందని కొన్ని వార్తలు వచ్చినప్పటికీ, అవి నిజం కాదని తాజా సమాచారం ద్వారా తేలింది. పూరీ జగన్నాధ్‌తో ఎన్నో చిత్రాలను నిర్మించిన ఛార్మి, ఈ ప్రాజెక్ట్‌లోనూ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ వంటి చిత్రాల తర్వాత వరుస డిజాస్టర్‌లను ఎదుర్కొన్న పూరీకి ఈ సినిమా ఒక గట్టి కమ్‌బ్యాక్‌గా నిలవనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెగ్గర్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ అన్ని భాషల్లో అందుబాటులో ఉంటే, అదే పేరును అధికారికంగా ఖరారు చేసే అవకాశం ఉందని సమాచారం.
Vaishnavi Chaitanya: ఎస్కేఎన్ ఎవరి గురించి అన్నారో మరి!
‘బెగ్గర్’ అనే టైటిల్ వినూత్నంగా, ఆకర్షణీయంగా ఉండటంతో ఇప్పటికే సినీ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. విజయ్ సేతుపతి వంటి నటుడితో పూరీ ఎలాంటి కథను అందిస్తారనే దానిపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. పూరీ జగన్నాధ్ గతంలో ‘పోకిరి’, ‘బిజినెస్‌మ్యాన్’, ‘టెంపర్’, ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తన సత్తా చాటారు. అయితే, ఇటీవలి కాలంలో వచ్చిన ‘లైగర్’, ‘డబుల్ ఇస్మార్ట్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచాయి. ఈ నేపథ్యంలో విజయ్ సేతుపతితో చేయబోయే ఈ కొత్త చిత్రం పూరీకి మళ్లీ విజయాల బాట పట్టించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. విజయ్ సేతుపతి తాజాగా ‘మహారాజా’ చిత్రంతో తమిళంలో మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించుకున్నారు. ఇక ఈ సినిమాను తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని ఏకకాలంలో తెరకెక్కించనుండగా పాన్ ఇండియా భాషలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కాంబినేషన్‌లో రాబోయే ‘బెగ్గర్’ సినిమా పూరీ జగన్నాధ్‌కు కొత్త ఊపిరి పోస్తుందా లేదా అనేది చూడాలి. అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.