సినిమా పరిశ్రమ దశాబ్దాలుగా పట్టి పీడిస్తోంది పైరసి. స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ రోజే పైరసీ రూపంలో నెట్టింట దర్శమనిస్తున్నాయి. ఒకప్పుడు కేవలం థియేటర్ ప్రింట్స్ రూపంలో పైరసీలు వచ్చేవి. కానీ డిజిటల్ యుగంలో సినిమా స్థాయి మారిపోయింది. ప్రపంచ స్థాయిలో తెలుగు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. దీంతో పైరసీ ముఠా కూడా టెక్నాలిజీకి అనుగుణంగా మరి మొదటి రోజే హై క్వాలిటీతో సినిమాలను పైరసీ చేస్తోంది. అత్తారింటికి దారేది నుండి ఇటీవల వచ్చిన తండేల్ వరకు తొలిరోజే హెచ్డి ప్రింట్ లు రిలీజ్ చేసింది పైరసీ గ్యాంగ్.
ఈ పైరసీ వలన నిర్మాతలు, థియేటర్ యజమాన్యం భారీగా నష్టపోతుంది. అసలే ఓటీటీ సంస్థల వలన థియేటర్ రెవెన్యు అంతంత మాత్రం గా ఉంటె ఇప్పుడు పైరసీ వలన ఇంకాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే తాజాగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పైరసీని నిలువరించేందుకు టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు కీలక కామెంట్స్ చేసారు. ఆయన మాట్లాడుతూ పైరసీ పై ఎవరి సినిమా ఎఫెక్ట్ అయితే వారే మాట్లాడతారు. శుక్రవారం మాట్లాడితే సోమవారానికి మర్చిపోతున్నారు. దానిని అడ్డుకట్ట వేయాలంటే ఓ ఉద్యమం కావాలి. ఎఫ్ డి సి చైర్మన్ గా నేను లీడ్ చెస్తాను, నిర్మాతలందరు కలిసి రావాలి.డబ్బులు పోయేవి నిర్మాతలవే. అందరూ మెల్కోవాలి.. అండర్ ప్రొడక్షన్స్ లో ఉన్నవారు కూడా ముందుకు రావాలి.నేను నిర్మాతగా పంపిణీదారుడిగా వన్ ఇయర్ బ్యాలెన్స్ షీట్ చూసుకుంటా’ అలా ప్రతీ ఒక్కరు చూసుకుంటూ జాగ్రత్త పడాలి. పైరసీపై అందరి కలిసి వస్తే ఏదైనా చేయగలం’ అని అన్నారు.
Also Read : RGV : రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు నోటీసులు.