Dhurandhar : పాకిస్థాన్’లో ధురంధర్ పైరసీ రికార్డ్
బాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్దే కాకుండా, పైరసీ ప్రపంచంలోనూ సంచలనం సృష్టిస్తోంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం పాకిస్తాన్‌లో ఒక అరుదైన, అంతకంటే దారుణమైన రికార్డును సొంతం చేసుకుందని తెలుస్తోంది. గత 20 ఏళ్లలో పాకిస్తాన్‌లో అత్యధికంగా పైరసీకి గురైన భారతీయ సినిమాగా ‘ధురంధర్’ నిలిచింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఈ సినిమాపై అధికారికంగా నిషేధం విధించినప్పటికీ, అక్కడి ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్‌లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్‌లోడ్లు నమోదయ్యాయని అంచనా.
Also Read: Pawan Kalyan – NTR : ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ ‘పర్సనాలిటీ రైట్స్’ పిటిషన్.. హైకోర్టు కీలక ఆదేశాలు
Also Read
- Niharika Konidela: వరుణ్ - లావణ్యల 'సీక్రెట్' లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
- Tollywood Pan World Movies: అందరికీ 'పాన్ వరల్డ్ మూవీ'నే కావాలా?
- Vijay Varma Dating: జవాన్ నటితో మిల్కీ బ్యూటీ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్! విజయ్ వర్మ ప్రేమలో ఉన్నాడా?
- Puri Jagannadh: పూరీ 'స్లమ్ డాగ్' విడుదలకు అడ్డంకులు?
గత రెండు దశాబ్దాల కాలంలో ఏ బాలీవుడ్ సినిమాకు కూడా ఈ స్థాయిలో పైరసీ డౌన్‌లోడ్లు రాలేదు. షారుఖ్ ఖాన్ నటించిన రయీస్ చిత్రం గతంలో పాకిస్తాన్‌లో భారీగా పైరసీకి గురైంది. రజనీకాంత్, అక్షయ్ కుమార్ నటించిన భారీ బడ్జెట్ చిత్రం 2.0 కూడా అప్పట్లో రికార్డు స్థాయిలో ఇల్లీగల్ డౌన్‌లోడ్లను నమోదు చేసుకుంది. ఇప్పుడు ‘ధురంధర్’ ఆ రెండు సినిమాల రికార్డులను అధిగమించి అగ్రస్థానానికి చేరుకుంది.
Also Read:Sharath Kumar : విజయ్ రాజకీయ నాయకుడే కాదు.. హిందువులమని చెప్పుకోవడానికి కూడా భయపడుతున్నారు!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, స్పై, ఇంటెలిజెన్స్ ఆపరేషన్ల నేపథ్యంలో సాగుతుంది. పాకిస్తాన్‌కు వ్యతిరేకమైన కంటెంట్ ఉందన్న కారణంతో అక్కడి సెన్సార్ బోర్డు ఈ సినిమాను బ్యాన్ చేసింది. అయితే, ఈ నిషేధమే అక్కడి ప్రేక్షకులలో మరింత కుతూహలాన్ని పెంచినట్లు కనిపిస్తోంది. థియేటర్లలో చూసే అవకాశం లేకపోవడంతో, టోరెంట్స్, టెలిగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సినిమాను వీక్షిస్తున్నారు. పాకిస్తాన్‌లోని ల్యారీ ప్రాంతంలో మాఫియాలో ఎంటర్ అయి ఉగ్రవాద రహస్యాలను భారత్ కి పంపే భారతీయ గూఢచారి కథ ఇది. రణవీర్ సింగ్, అక్షయ్ ఖన్నా, సంజయ్ దత్, ఆర్. మాధవన్ వంటి భారీ తారాగణం ఉండటం సినిమాపై క్రేజ్ పెంచింది. పైరసీ ప్రభావం ఉన్నప్పటికీ, భారత్ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సినిమా ఇప్పటికే ₹500 కోట్లకు పైగా వసూళ్లను సాధించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. పాకిస్తాన్‌లో అధికారికంగా విడుదల కాకపోయినా, ఈ స్థాయి ‘పైరసీ హిట్’ అవ్వడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Earthquake: గుజరాత్‌లో భూకంపం.. ఆందోళనలో ప్రజలు!
-
PM Modi: ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు.. మల్లికార్జున్ ఖర్గేకు ఎన్నికల సంఘం నోటీసులు
-
Donald Trump: గుడ్‌న్యూస్ చెప్పిన డొనాల్డ్ ట్రంప్.. ఈ శుక్రవారంతో అంతా ఫైనల్..
-
World Cup 2011: అందుకే 2011 వరల్డ్ కప్‌లో రోహిత్ శర్మను తీసుకోలేదు.. ‘నన్ను క్షమించు’: శ్రీకాంత్
-
Niharika Konidela: వరుణ్ – లావణ్యల ‘సీక్రెట్’ లవ్ స్టోరీ.. అసలు విషయం బయటపెట్టిన నిహారిక!
ట్రెండింగ్
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!
-
Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
-
భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
200MP+200MP కెమెరాలు, IP66, IP68, IP69 రేటింగ్స్, 7025mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ OPPO Find X9s Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
కాంపాక్ట్ డిజైన్, 8000mAh బ్యాటరీతో OPPO Pad Mini లాంచ్.. ధర ఎంతంటే.?