తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.
Also Read:NTR Fans: టీడీపీ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ ప్రెస్ మీట్ క్యాన్సిల్?
సోషల్ మీడియా ఇన్ఫ్లుఎన్సర్ అయిన ధర్మ మహేష్ భార్య గౌతమి చౌదరిని ధర్మ మహేష్ 2019లో వివాహం చేసుకున్నారు. అయితే ధర్మ మహేష్, గౌతమి కలిసి హైదరాబాదులో రెస్టారెంట్ బిజినెస్ ప్రారంభించారు. దీని పెట్టుబడి అంతా గౌతమి తండ్రి పెట్టినట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఇంకా కట్నం తీసుకురావాలని ధర్మ మహేష్, గౌతమి మీద, ఆమె కుటుంబం మీద ప్రెజర్ చేస్తున్నట్లు కేసు రిజిస్టర్ అయింది. డ్రింకర్ సాయి రిలీజ్ తర్వాత మరిన్ని సినిమాలు పట్టాలెక్కించే పనిలో పడ్డాడు ధర్మ మహేష్. ఈ సమయంలో ఈ వివాదంలో చిక్కుకోవడం గమనార్హం.