తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్‌లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.…