టెక్నో త్వరలో భారత మార్కెట్లో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Tecno Pova Curve 2ను లాంచ్ చేయనుందని అధికారికంగా ధృవీకరించింది. లాంచ్ తేదీ ఇంకా ప్రకటించనప్పటికీ, ఇప్పటికే విడుదలైన టీజర్లు మరియు సర్టిఫికేషన్ లిస్టింగ్స్ ద్వారా ఫోన్ డిజైన్, హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన కీలక వివరాలు బయటకు వచ్చాయి. మే 2025లో విడుదలైన Tecno Pova Curve 5Gకు ఇది సక్సెసర్‌గా రానుండగా, అదే కర్వ్‌డ్ డిజైన్ భాషను మరింత మెరుగుపరిచి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.
భారతదేశంలో లాంచ్ ఖాయం
X (ట్విట్టర్)లో టెక్నో షేర్ చేసిన తాజా టీజర్ ప్రకారం, Tecno Pova Curve 2 త్వరలోనే భారత్‌లో లాంచ్ కానుంది. టీజర్‌లో ఫోన్‌కు సంబంధించిన ఒక భాగం యొక్క పారదర్శక రెండర్‌ను చూపించారు. ఖచ్చితమైన లాంచ్ తేదీని త్వరలో వెల్లడిస్తామని కంపెనీ సంకేతాలు ఇచ్చింది.
డిజైన్
టీజర్ ఇమేజ్ ప్రకారం, ఫోన్‌లో కర్వ్‌డ్ ఎడ్జ్ డిజైన్ ఉండనుంది. వెనుక భాగంలో వృత్తాకార కెమెరా కటౌట్‌తో కూడిన పెద్ద కెమెరా మాడ్యూల్ కనిపించే అవకాశం ఉంది. ఇది Tecno Pova Curve 5Gకు సమానమైన డిజైన్‌ను కలిగి ఉండవచ్చని టెక్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Tecno Pova Curve 2 ఫీచర్లు (అంచనా)
గూగుల్ ప్లే కన్సోల్ లిస్టింగ్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నంబర్ TECNO-LK7kగా ఉండనుంది. దీనిని Tecno Pova Curve 2 5Gగా గుర్తించారు. ప్రాసెసర్: MediaTek Dimensity 7100 SoC (MT6858), GPU: ARM Mali-G610 (1000MHz), CPU కాన్ఫిగరేషన్: 1+3+4 కోర్ సెటప్.. Cortex-A78 (2.5GHz), Cortex-A55 (2.0GHz), RAM: 12GB వరకు, OS: Android 16.. డిస్‌ప్లే.. 1080 × 2364 పిక్సెల్ రిజల్యూషన్.. 420ppi పిక్సెల్ డెన్సిటీ.. ఇక, TUV సర్టిఫికేషన్ లిస్టింగ్ ప్రకారం, Tecno Pova Curve 2లో భారీ 7,750mAh లిథియం-అయాన్ పాలిమర్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఇది దీర్ఘకాల బ్యాటరీ బ్యాక్‌అప్‌ను అందించనుంది.
ఈ తాజా ఫోన్‌లో పెద్ద బ్యాటరీ, కర్వ్‌డ్ డిజైన్, లేటెస్ట్ ఆండ్రాయిడ్ వెర్షన్ మరియు పవర్‌ఫుల్ డైమెన్సిటీ చిప్‌సెట్‌తో Tecno Pova Curve 2 మిడ్-రేంజ్ సెగ్మెంట్‌లో మంచి పోటీ ఇవ్వనుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. లాంచ్ సమీపిస్తుండటంతో, రాబోయే రోజుల్లో ధర, కెమెరా సెటప్, ఫాస్ట్ ఛార్జింగ్ వివరాలను టెక్నో అధికారికంగా వెల్లడించే అవకాశం ఉంది.