తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’). ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్లో ధనుష్ సరసన నిత్యామేనన్ హీరోయిన్గా కనిపించనుండగా, ప్రకాశ్ రాజ్, శాలినీ పాండే, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎన్న సుగం..’ అనే ఈ సింగిల్‌లో, నిత్యామేనన్ తన ప్రేమికుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రేమపూరిత సన్నివేశాలు కనిపిస్తాయి. “నువ్వు నా భాగస్వామి అయితే.. ఆ గుడిసె గుడిలా మారుతుంద” అనే పాటల లైన్స్ ప్రేమలో ఉన్న ఒక అమ్మాయి భావోద్వేగాన్ని చూపించారు.
Also Read : Coolie : యూఎస్ లో ‘కూలీ’ సెన్సేషన్..
ఈ మెలోడియస్ పాటకు సంగీతం అందించిన వారు జీవీ ప్రకాష్ కుమార్ కాగా, గీతాన్ని ధనుష్ స్వయంగా ఆలపించడమే కాకుండా, శ్వేతా మోహన్‌తో కలసి పాడారు. పాట గ్రామీణ నేపథ్యం తో సాగుతూ, మనసుకు హత్తుకునేలా ఉంది. డాన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాట ద్వారా సినిమా టోన్, భావోద్వేగాల లోతులు స్పష్టమవుతుండటంతో, అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగిపోయాయి.