Coolie : యూఎస్ లో ‘కూలీ’ సెన్సేషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కూలీ’. దర్శకుడు లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా, పాన్ ఇండియా లెవెల్ లో అత్యధికంగా ఎదురుచూసే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సమానంగా బాక్సాఫీస్ అంచనాలు కూడా ఏ రేంజ్‌లో ఉన్నాయో.. యూఎస్ బుకింగ్స్‌తోనే స్పష్టమవుతోంది. తాజా సమాచారం ప్రకారం అమెరికాలో ‘కూలీ’ ప్రీమియర్ బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమైనప్పటికీ, ఈ సినిమాకి వచ్చిన స్పందన అంతాఅంతకాదు. విడుదలకు ఇంకా సగం నెలకి పైగా టైమ్ ఉన్నా, ఇప్పటికే హాఫ్ మిలియన్ మార్క్‌ని దాటి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇది రజినీ క్రేజ్, లోకేష్ బ్రాండ్, అనిరుద్ మ్యూజిక్ పట్ల ఉన్న అంచనాలకు నిదర్శనం.
ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. మాస్, యాక్షన్, ఎమోషన్‌తో కూడిన భారీ కథనాన్ని ముందుకు తీసుకువెళ్తున్న దర్శకుడు లోకేష్, ఈ చిత్రానికి అనిరుద్ సౌండ్‌ట్రాక్‌తో మరింత ఊపు తేనున్నాడు. అన్ని భాషల్లోనూ భారీ ఎత్తున రిలీజ్ కానున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇక రజినీకాంత్ అభిమానులు ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ సినిమాపై భారీ ప్రమోషన్స్ చేస్తున్నారు. టీజర్, పోస్టర్లు, రజినీ లుక్, డైలాగ్ క్లిప్స్ అన్నీ వైరల్ అవుతుండటంతో, ఫ్యాన్స్ ఫీవర్ రోజురోజుకీ పెరుగుతోంది. ముఖ్యంగా యూఎస్‌లో ఈ స్థాయి స్పందన రావడం మిగతా మార్కెట్‌లోనూ భారీ ఓపెనింగ్స్‌కి దారితీయనుంది. ‘జైలర్’ సక్సెస్ తర్వాత రజినీకాంత్ నుండి వస్తున్న ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద మరోసారి రజినీ మేజిక్ కనబడుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
Also Read
- Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
- Rangasthalam Locket: శ్రీకాంత్ ఓదెల మెడలోని లాకెట్‌తో చిరంజీవి, రామ్ చరణ్‌కి అరుదైన బంధం! ఎవరు గిఫ్ట్‌గా ఇచ్చారంటే?
- Samantha Seemantham: శ్రీవిద్య పద్ధతిలో సమంత సీమంతం.. "నా బిడ్డకు దక్కిన వరం" అంటూ ఎమోషనల్ పోస్ట్!
- The Paradise: ఆడియన్స్ కోసమే ఆ రిస్క్ చేశాం.. 'ది ప్యారడైజ్' షూటింగ్ డిలే వెనుక అసలు నిజాలు చెప్పిన శ్రీకాంత్ ఓదెల!
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!