తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న నూతన చిత్రం ‘ఇడ్లీ కడై’ (తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’). ఈ మ్యూజికల్ లవ్ ఎంటర్టైనర్‌లో ధనుష్ సరసన నిత్యామేనన్ హీరోయిన్‌గా కనిపించనుండగా, ప్రకాశ్ రాజ్, శాలినీ పాండే, సముద్రఖని తదితరులు కీలక పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి తొలి పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ‘ఎన్న సుగం..’ అనే ఈ సింగిల్‌లో, నిత్యామేనన్ తన ప్రేమికుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్న ప్రేమపూరిత సన్నివేశాలు కనిపిస్తాయి.…