యంగ్ టైగర్ ఎన్టీయార్, జాన్వీ కపూర్ జోడిగా కొరటాల శివ తెరకెక్కించిన దేవర సూపర్ గా నిలిచింది. సెప్టెంబరు 27న రిలీజ్ అయిన దేవర 50రోజలు పూర్తి చేసుకుంది. రిలీజ్ కాబడిన అన్ని సెంటర్స్ లో బ్రేక్ ఈవెన్ సాధించి బయ్యర్స్ కు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. యంగ్ టైగర్ నటన, యాక్షన్ సీన్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.దేవర విజయంతో తారక్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇప్పటికి ఆంధ్రాలో ముఖ్యమైన సెంటర్స్ లో దేవర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.
Also Read : VenkyAnil -3 : సంక్రాంతికి వస్తున్నాం.. రమణ గోగుల పాడిన సాంగ్ రిలీజ్
దేవర డిజిటల్ రైట్స్ ను భారీ ధరకు కొనుగోలు చేసిన ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్ కు తీసుకువచ్చింది. నవంబరు 8న డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చిన దేవర సూపర్ రెస్పాన్స్ రాబడుతోంది. మిలియన్ వ్యూస్ రాబడుతూ దూసుకెళ్లింది. దేవర పార్ట్1 తన గ్లోబల్ డామినేషన్ ను కొనసాగిస్తోంది. రిలీజ్ నాటి నుండి ఇప్పటి వరకు 2024లో అత్యధిక కాలం ట్రెండింగ్‌లో ఉన్న తెలుగు చిత్రంగా వరుసగా 4వ వారం ట్రెండ్ అవుతోంది దేవర. అలాగే 2.8M వ్యూస్ రాబట్టడంతో పాటు నెట్ ఫ్లిక్స్లో 8.1 మిలియన్ గంటలు చుసిన నాన్ ఇంగ్లిష్ చిత్రాలలో ప్రపంచవ్యాప్తంగా 6వ స్థానంలో కొనసాగుతుంది. దేవర 7 దేశాలలో టాప్ 10 హిట్ సినిమాల లిస్ట్ లో నిలిచింది. అటు థియేటర్స్ లోను ఇటు ఓటీటీ లోను దేవర రికార్డ్స్ క్రియేట్ చేయడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో మరోసారి ఎక్స్ లో దేవర ను ట్రెండింగ్ చేస్తున్నారు.