Devara Distributor Naga Vamsi Hyping after Ramajogayya Sastry: ఎన్టీఆర్ దేవర ఎలా ఉంటుందో ఏమో గానీ.. మేకర్స్ ఇస్తున్న హైప్‌తోనే టైగర్ ఫ్యాన్స్ పోయేలా ఉన్నారు. సోషల్ మీడియాతో పాటు.. ఈ సినిమాలో నటిస్తున్న నటీ నటులు ఇస్తున్న హైప్ మామూలుగా లేదు. ముఖ్యంగా.. దేవర మేకర్స్ పోతారు.. అంతా పోతారు అనే రేంజ్ లో చెబుతున్నారు. లిరిక్ రైటర్ రామజోగయ్య శాస్త్రి కూడా దేవరను ఓ రేంజ్‌లో లేపుతున్నాడు. చెప్పాలంటే.. ఓ రకంగా దేవరకు ఇది మైనస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. భారీ అంచనాల మధ్య థియేటర్లోకి వెళ్లిన ఆడియెన్స్‌కి.. సినిమా ఆ రేంజ్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి రీచ్ అవకుండా ఉంటే.. డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉంది. సినిమా బాగున్నా కూడా.. మేకర్స్ ఇచ్చే హైప్‌కి ఇంకా ఏదో కావాలి అనేది నెగెటివిటీకి దారి తీస్తుంది.
Rekha Nair: తమిళ లైంగిక వేధింపుల లిస్టు తీస్తే 500 మంది ఇరుక్కుంటారు.. నటి సంచలనం
అదే.. తక్కువ అంచనాలతో థియేటర్లోకి అడుగుపెడితే.. సినిమా అంచనాలకు మించి వావ్ ఫ్యాక్టర్ అనేలా ఉంటే.. బాక్సాఫీస్ దగ్గర టైగర్ వేట మామూలుగా ఉండదు. అయినా కూడా.. దేవర హైప్‌ను పెంచుతునే ఉన్నారు మేకర్స్. ఒక్క మాటలో చెప్పాలంటే.. దేవర ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంటుందని అంటున్నారు. ఇక ఈ సినిమాను తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సితార ఎంటర్టైన్మెంట్ నిర్మాత నాగవంశీ.. ఏకంగా చికెన్ ఫ్రై, బిర్యానీ అంటూ రచ్చ చేస్తున్నాడు. ఇప్పటికే దేవర నుంచి రెండు పాటలు రిలీజ్ అవగా.. అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు థర్డ్ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. సెప్టెంబర్ 4వ తేదీన, అంటే రేపే దావుడి సాంగ్ రిలీజ్ కానుంది. ఈ పాటలో ప్రతీ బీట్ టైగర్ ఫ్యాన్స్ విజిల్ వేసేలా ఉంటుందని.. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మాస్ స్టెప్స్ మామూలుగా ఉండవని అంటున్నారు. ఇదే విషయాన్ని నాగవంశీ చెబుతూ.. రేపు ‘చికెన్ ఫ్రై‘ పెడుతున్నాం.. పాటలో కొంత భాగం ‘బిర్యాని‘లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం ధియేటర్‌కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే.. అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. ఈ లెక్కన అనిరుధ్ ఎలాంటి ట్యూన్ ఇచ్చాడో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు.. ఈసారి లిరికల్ కాకుండా.. వీడియో సాంగ్‌నే రిలీజ్ చేస్తున్నారు. అయినా కూడా.. బిర్యానీ మాత్రం థియేటర్ లో ఉంటుందని అంటున్నారు. మరి అనిరుధ్ ఈసారి ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.
రేపు ‘చికెన్ ఫ్రై‘ పెడుతున్నాం. పాటలో కొంత భాగం ‘బిర్యాని‘ లా అనిపిస్తుంది. దానికోసం మాత్రం ధియేటర్ కు తప్పనిసరిగా వెళ్లాల్సిందే… 😉🤩#Daavudi #Devara
An @AnirudhOfficial Musical 🎶
Man of Masses @tarak9999 #KoratalaSiva #SaifAliKhan #JanhviKapoor @NANDAMURIKALYAN… pic.twitter.com/xL2EV47emo
— Naga Vamsi (@vamsi84) September 3, 2024