బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె గురించి పరిచయం అక్కర్లేదు. ‘ఓం శాంతి ఓం’ మూవీతో ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమానే షారుఖ్ జోడిగా కనిపించిన దీపికా.. ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇక తన కెరీర్ లో జవాన్, కల్కి 2898 ఎడి, పఠాన్, పద్మావత్, చెన్నైఎక్స్‌ప్రెస్, ఫైటర్, హ్యాపీ న్యూఇయర్, యే జవానీ హైదీవానీ, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా.. వంటి సినిమాలు అత్యధిక వసూళ్లు రాబట్టాయి. దీంతో అతి తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్ సంపాదించుకుంది. ఇక తాజాగా అమ్మతన్నాని ఆస్వాదిస్తున్న దీపిక తనకు సంబంధించిన హెల్త్ ప్రాబ్లం గురించి పంచుకుంది..
Also Read: Shanmukha: రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఆది సాయికుమార్ థ్రిల్లర్ మూవీ..
దీపిక మాట్లాడుతూ ‘2014లో నా కెరీర్ పీక్స్‌లో ఉన్నా క్షణాలు అవి. అసలు తీరిక లేకుండా సినిమాలు చేస్తూ ఆనందంగా ఉన్నా . అలాంటి సమయంలో ఓసారి తీవ్ర అలసటకు గురై లొకేషన్‌లోనే కళ్లు తిరిగి పడిపోయా. ముందు లైట్ తీసుకున్నా. కానీ ఎందుకో మనసు కీడు శంకించింది. దీంతో అవసరమైన స్కానింగులు, టెస్ట్‌లు చేయించుకున్నా. నా పరిస్థితి అంత బాలేదని అర్థమైంది. ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గిపోయే సమస్యలే అయినప్పటికి ఏదో అయిపోతున్నట్టు భయపడిపోయేదాని, విపరీతంగా ఏడ్చేసేదాన్ని. అలా మానసికంగా కృంగిపోయా. నా విషయం తెలుసుకొని మా అమ్మ నన్ను చూడ్డానికి ముంబయి వచ్చింది. అమ్మ సూచన ప్రకారం థెరపిస్ట్‌ని కలిశాను. నేను థెరపిస్ట్ వద్దకు వెళ్తున్న విషయాన్ని గోప్యంగా ఉంచమని అమ్మ చెప్పింది. అమ్మమాట మీద ఎవరికీ తెలీకుండా సీక్రెట్‌గా థెరపీ తీసుకునేదాన్ని. నిదానంగా దాని నుండి కోలుకున్న తర్వాత నా మానసిక ఆరోగ్యం గురించి అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగాను. అప్పుడు అనిపించింది అమ్మ ఈ విషయం ఎందుకు గోప్యంగా ఉంచమన్నదో. నేను ‘లివ్ లాఫ్ లవ్’ ఫౌండేషన్ స్థాపించడానికి కారణం కూడా అదే’ అంటూ గుర్తు చేసుకుంది దీపిక పదుకొణె.