వెబ్ సిరీస్… ఇప్పుడు ఇది సరికొత్త క్రేజ్! సినిమాల కోసం ఎలా జనం వెయిట్ చేస్తుంటారో అదే రేంజ్లో కొన్ని వెబ్ సిరీస్ ల కోసం కూడా ఎదురు చూస్తున్నారు. కరోనా లాక్ డౌన్స్ కారణంగా నెటిజన్స్ మరింతగా అలవాటు పడ్డారు ఇంటర్నెట్ ఎంటర్టైన్మెంట్. క్రైమ్ మొదలు లవ్ అండ్ రోమాన్స్ దాకా అన్ని రకాల జానర్స్ వెబ్ సిరీస్ ల రూపంలో ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. మరీ ముఖ్యంగా, కొన్ని సక్సెస్ ఫుల్ సిరీస్ లు రెండో, మూడో సీజన్ కోసం ఫ్యాన్స్ నిరీక్షించేలా చేయగలుగుతున్నాయి! అటువంటి మచ్ అవెయిటెడ్ వెబ్ సిరీస్ లు ఏంటో ఓ సారి చూసేద్దాం…
‘ద ఫ్యామిలీ మ్యాన్’ ఇప్పటికే రెండు సీజన్లతో ఆకట్టుకున్నాడు. ఫ్యామిలీ మ్యాన్ గా మూడో సీజన్లో మనోజ్ బాజ్ పాయ్ చైనీస్ ఏజెంట్ల ఆట కట్టించనున్నాడు. అందుకే, సీజన్ వన్ లో పాకిస్తాన్, సీజన్ టూలో శ్రీలంక టెర్రరిస్టుల కుట్రలకి ఫిదా అయిన ప్రేక్షకులు మూడో సీజన్ లో చైనా వార్ని ఇండియన్ హీరోస్ ఎలా ఎదుర్కుంటారో చూడాలనుకుంటున్నారు!
అర్హద్ వార్సీ ప్రధాన పాత్రలో నటించిన వెబ్ సిరీస్ ‘అసుర్’. ఈ షో సీజన్ టూ ఎప్పుడు వస్తుందా అని ఈగర్ గా ఉన్నారు ఆడియన్స్. మొదటి సీజన్ లో సైకోపాత్ కిల్లర్ గురించి వెదుకుతుండగా అతను తమ టీమ్ లోనే ఉన్నట్టు గుర్తిస్తారు హీరో, అతడి స్నేహితులు. తరువాత ఏమైందో సీజన్ టూలో చూడాల్సి ఉంది…
సమాజంలో బాగా డబ్బు, పరపతి ఉన్న వాళ్లు నేరం చేసి కూడా ఎలా తప్పించుకుంటారో ‘అందేఖి’ సిరీస్ లో చూపించారు. సీజన్ టూలో డీఎస్పీ స్థాయి వ్యక్తి ఎలా శిక్ష తప్పించుకోవాలని ప్రయత్నిస్తాడో చూపించబోతున్నారు. అతడు చివరికి చట్టానికి తల వంచాడా? లేదా? సీజన్ 2లోని ట్విస్ట్ అదే!
‘స్పెషల్ ఓపీఎస్’ ఇప్పటికే సూపర్ సక్సెస్ అయింది. నీరజ్ పాండే లాంటి పేరున్న డైరెక్టర్ కూడా ఈ వెబ్ సిరీస్ వెనుక ఉండటంతో మొదట్నుంచీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అయితే, తాజా సీజన్ లోనూ టెర్రరిస్టు ఎటాక్స్ వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరు అన్నదే ప్రధాన ప్రశ్నగా కథ సాగనుంది!
1990లలో బీహార్ లో జరిగిన యధార్థ సంఘటనలే ‘మహారాణి’ సిరీస్ కి ప్రేరణ. హ్యూమా ఖురేషి కీ రోల్ లో కనిపించిన ఈ వెబ్ షో సీజన్ టూ జనాల్ని అలరించనుంది. పవర్, పాలిటిక్స్ వెనుక ఉండే మనకు తెలియని చీకటి కోణాల్ని దర్శకుడు చక్కగా సీజన్ వన్ లో చూపించాడు.
సాధారణంగా వెబ్ సిరీస్ లు సీరియస్ గానే ఉంటాయి. కానీ, కొన్ని కామెడీ సిరీస్ లు కూడా నెటిజన్స్ మనసు దోస్తున్నాయి. అటువంటిదే ‘పంచాయత్’. ఓ సిటీ కుర్రాడు చిన్న పల్లెటూర్లో పంచాయితీ సెక్రటరీగా డ్యూటీలో చేరతాడు. ఆ తరువాత జరిగిన కామెడీయే స్టోరీ మొత్తం! త్వరలో రాబోయే ‘పంచాయత్ 2’ కోసం నెటిజన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు!
సుస్మితా సేన్ లాంటి సీనియర్ బ్యూటీ ప్రధాన ఆకర్షణగా బరిలోకి దిగింది ‘ఆర్య’ వెబ్ సిరీస్. తొలి ప్రయత్నం భారీ విజయాన్ని సాదించింది. సుస్మిత తనని తాను ఓ వపర్ ఫుల్ లేడీగా ఎస్టాబ్లిష్ చేసుకోగలిగింది. సెకండ్ సీజన్ లో ఆమె ఎత్తులు, పైఎత్తులు ఎలా ఉంటాయన్నదే జనంలో ఆసక్తికి కారణం.
ధ్రువ్, కావ్య రొమాంటిక్ లవ్ స్టోరీయే ‘లిటిల్ థింగ్స్’. ఇది కూడా సీరియస్ గా లేకుండా ఆకట్టుకునే కూల్ వెబ్ సిరీస్. ఇప్పటికే మూడు సీజన్స్ పూర్తి కాగా ‘లిటిల్ థింగ్స్ 4’ కోసం రొమాంటిక్ లవ్వర్స్ ఎదురు చూస్తున్నారు. ‘లిటిల్ థింగ్స్’ను చూపిస్తూనే బిగ్ సక్సెస్ సాధించింది ఈ బ్యూటిఫుల్ డ్రామా సిరీస్!