Pushpa 2: మహిళ మృతి.. అల్లు అర్జున్ పై కేసు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తొక్కిసలాటలో మహిళ మృతి చెందిన క్రమంలో సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు యాజమాన్యంతో పాటు అల్లు అర్జున్, ఆయన టీం పైన కూడా కేసు నమోదు చేశారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా అల్లు అర్జున్ తీసుకురావడంపై కేసు నమోదు చేసినట్టు చెబుతున్నారు. అల్లు అర్జున్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ సిబ్బంది చేసిన హంగామాతో తొక్కిసలాట జరిగినట్టు పోలీసులు తేల్చారు. అల్లు అర్జున్ సెక్యూరిటీ సిబ్బంది తోయడం వలెనే తోపులాట జరిగి ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. మధ్య మండల డిసిపి అక్షాంశ్ యాదవ్ మాట్లాడుతూ నిన్న రాత్రి 9.40 సమయంలో పుష్ప 2 ప్రీమియర్ షో సంధ్య థియేటర్లో ఏర్పాటు చేశారని అన్నారు. దీనికి అధిక సంఖ్యలో ప్రేక్షకులు హాజరయ్యారని, ప్రేక్షకులతో పాటు సినిమాలో నటించిన కీలక నటులు హాజరవుతారని సమాచారం మాకు లేదని అన్నారు. కనీసం థియేటర్ యాజమాన్యం కూడా మాకు ఆ సమాచారం చెప్పలేదు, థియేటర్ యాజమాన్యం కూడా ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోలేదని అన్నారు. పబ్లిక్ ను కంట్రోల్ చేసేందుకు ఎలాంటి ప్రైవేటు భద్రతను ఏర్పాటు చేయలేదన్న ఆయన ఎంట్రీ, ఎగ్జిట్ లలో కూడా ఎటువంటి ప్రత్యేక ఏర్పాట్లు చేయలేదని అన్నారు.
Sukumar: రాజమౌళి’ భయపడినంతా అయ్యింది.. సరైనోడు తగిలాడు.. ‘సుకుమార్’ మెంటల్ మాస్!
Also Read
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
- Dragon Update: 'డ్రాగన్' డెడ్‌లైన్ మిస్సైతే..!
నటీనటుల కూడా ఎటువంటి ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేయలేదని, 9.30 కి తన వ్యక్తిగత భద్రత సిబ్బందితో సంధ్య థియేటర్ వద్దకు అల్లు అర్జున్ చేరుకున్నారని అన్నారు. ఆ సమయంలో అల్లు అర్జున్ థియేటర్ లోపలికి వెళ్లిన సమయంలో భద్రతా సిబ్బంది ప్రేక్షకులను నెట్టి వేయడం ప్రారంభించారని, అప్పటికే థియేటర్ లోపల బయట ప్రేక్షకులతో కిక్కిరిసిపోయి ఉందని అన్నారు. అదే సమయంలో అల్లు అర్జున్ లోపలికి వెళ్లగా ప్రేక్షకులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. అదే సమయంలో దిల్సుఖ్నగర్ కు చెందిన రేవతి అతని కుమారుడుతో ఆ ప్రాంతంలో ఉంది, అధిక సంఖ్యలో ప్రేక్షకులు ఉండటంతో వారికి ఊపిరాడలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది వారిని బయటకు లాగారు. 13 ఏళ్ల శ్రీతేజ్ కు సిపిఆర్ చేశారు, దుర్గాబాయి దేశముఖ్ ఆసుపత్రి తరలించారు. అప్పటికే రేవతి మృతి చెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. శ్రీ తేజను మరో ఆసుపత్రికి తరలించారని అక్కడ వైద్యులు సూచించారు. ఈ ఘటనపై బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాంఅని అన్నారు. బిఎన్ఎస్ యాక్టీవ్ లోని 105 118(1), రెడ్ విత్ త్3(5) సెక్షన్ల కింద చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
Russia Oil: ‘‘రష్యా చమురు కొనొద్దు’’.. భారత్, చైనాలకు ట్రంప్ టీమ్ వార్నింగ్..
-
Jeevanlal Lavidiya : మాజీ ఐటీ కమిషనర్‌కు మరో షాక్.. భార్యపైనా కేసు.!
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!