దర్శక ధీరుడు రాజమౌళికి తిరుగు లేదు. ఆయన సినిమా చేస్తే వేల కోట్లు వస్తాయి. కానీ దశాబ్ద కాలం క్రితం రాజమౌళి ఓ మాట చెప్పారు. వాళ్లు నిజంగా కాన్సంట్రేట్ చేసి మాస్ సినిమాలు తీశారంటే.. ఇక మనం సర్దుకోవాల్సిందే అని భయపడే డైరెక్టర్లు త్రివిక్రమ్, సుకుమార్ అని చెప్పుకొచ్చారు. మా అదృష్టం కొద్ది వాళ్లు ఫుల్‌ఫ్లెడ్జ్ మాస్ మసాలా సినిమా తీయడం లేదని అన్నాడు. కానీ అప్పుడు రాజమౌళి చెప్పిందే.. ఇప్పుడు అక్షరాలా నిజమైంది. ఇప్పటి వరకు సుకుమార్ చేసిన ఊరమాస్ సినిమా ఏదంటే.. పుష్ప 2 అని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అసలు సెకండ్ సినిమా ‘జగడం’తోనే సుకుమార్ మాస్ బాట పట్టాడు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో.. క్లాస్ సినిమాలు చేస్తు వచ్చిన సుక్కు.. రంగస్థలం నుంచి యూటర్న్ తీసుకున్నాడు. పుష్ప పార్ట్ 1ని మాస్ శాంపిల్ అనేలా చేసిన లెక్కల మాస్టారు.. ఇప్పుడు పాన్ ఇండియా షేక్ అయ్యే ఊర మాస్ బొమ్మ చేసి.. బాక్సాఫీస్‌ను తగలబెట్టేశాడు. గతంలో ఓసారి బన్నీ చెప్పినట్టుగా.. అసలు ఇలా కూడా సినిమా తీస్తారా? అనేలా చేశాడు సుక్కు.
Vijaysai Reddy: మేం మళ్లీ అధికారంలోకి వస్తాం.. చంద్రబాబు జైలుకు వెళ్తాడు!
పుష్ప 2 సినిమాలో.. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రతీ ఫ్రేమ్ కూడా సుకుమార్ ఇచ్చిన హైకి తగ్గకుండా ఉంటుంది. మరీ ముఖ్యంగా జాతర ఎపిసోడ్ పీక్స్ అంటే.. క్లైమాక్స్ పీక్స్ కా బాప్ అనేలా ఉంటుంది. సుకుమార్ టేకింగ్‌కు అల్లు అర్జున్ నటవిశ్వరూపం చూపించాడు. ఒక్క బన్నీనే కాదు.. సినిమాలో నటించిన ప్రతి ఒకరి నుండి తనకు ఎంత కావాలో అంత పర్ఫామెన్స్ రాబట్టాడు సుకుమార్. చెప్పాలంటే.. ఒక్కోసారి ఇది సుకుమార్ సినిమానేనా? అనే డౌట్స్ కూడా రాకమానదు. మొత్తంగా.. రాజమౌళి చెప్పినట్టుగా ‘సుకుమార్ క్లాస్ సినిమాలు వదిలేసి మాస్ సినిమాలు చేస్తే తట్టుకోవడం ఎవరి వల్ల కాదని’ పుష్ప2తో ప్రూవ్ అయింది. కానీ పుష్ప పాన్ ఇండియా మూవీ అవడానికి మెయిన్ రీజన్ రాజమౌళినే. ఆయన సలహా మేరకే.. పాన్ ఇండియా లెవల్లో పుష్ప పార్ట్ 1 రిలీజ్ చేసి.. ఇప్పుడు పుష్ప2తో వెయ్యి కోట్ల క్లబ్‌లో ఎంట్రీ ఇవ్వబోతున్నాడు సుకుమార్. ఏదేమైనా.. పుష్ప2 మాత్రం అంచనాలకు మించి ఉందనే చెప్పాలి.