‘పెళ్లి సందడి’ మూవీతో టాలీవుడ్‌లోకి ఏంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటి శ్రీలీల. కెరీర్ ప్రారంభంలోనే చిన్న పెద్ద అనే తేడా లేకుండా స్టార్ హీరోలతో, జెట్ స్పీడ్ లో ఎడా పెడా సినిమాలు చేసింది. కానీ అందులో ఫ్లాపులు కూడా వరుస కట్టాయి. దాంతో శ్రీ లీల కాస్త డౌన్ అయ్యింది. మళ్లీ ‘పుష్ప 2’ లో ఐటెమ్ సాంగ్ తో రేసులోకి వచ్చింది. ఆ పాట బాగా క్లిక్ అయింది. దాంతో కొత్త అవకాశాలు వచ్చి చేరాయి. అయితే తాజాగా శ్రీ లీల రెమ్యూనరేషన్ గురించి కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రజంట్ తెలుగులో శ్రీలీలతో సినిమా అంటే ఆమెకు రూ.3 కోట్లు సమర్పించుకోవాల్సిందే.
Also Read:Yahs: ‘టాక్సిక్’ సినిమా విడుదల పై లేటెస్ట్ బజ్..!
ఇక రీసెంట్ గా శ్రీ లీల ఓ హిందీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ కోసం ఆమె కేవలం రూ. 1.75 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరినట్టు టాక్. హిందీ మార్కెట్‌లో మొదటి సినిమా కాబట్టి తక్కువ రెమ్యునరేషన్‌కు ఓకే చెప్పిందని అంటున్నారు. కానీ తెలుగులో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఆమె, బాలీవుడ్ ఎంట్రీలో అంత తక్కువ రెమ్యునరేషన్ కు ఒప్పుకోవడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
నిజానికి బాలీవుడ్ లో పారితోషికాలు ఎక్కువే ఉంటాయి. ఇటీవల రష్మికకి ‘చావా’ మూవీతో రూ.4 కోట్ల పారితోషికం అందిందని టాక్. సౌత్ లోనూ తను అంతే మొత్తాన్ని అందుకొంటోంది. ఇక బాలీవుడ్ నటీనటులు.. టాలీవుడ్‌లో నటించిన భారీ మొత్తంలోనే పారీతోషకం అందుకుంటున్నారు. హిందీ హీరోయిన్ లు కూడా, అక్కడ ఎంత డిమాండ్ చేస్తున్నారో, ఇక్కడ కూడా అంతే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇవన్నీ తెలిసి శ్రీ లీల అంత తక్కువ లో సినిమా చేయడం వింత అనే చెప్పాలి.