Allu Arjun-Atlee: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా అట్లీ డైరెక్షన్ లో ఓ పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. ‘AA 22’గా ఇది ప్రచారం అవుతుంది. తాజాగా ఈ మూవీకి సంబంధించి అట్లీ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఏదైనా ఒక్క ఆలోచనతోనే స్టార్ట్ అవుతుంది.. ఈ చిత్రంతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి మేం ట్రై చేస్తున్నాం.. అభిమానులు ఆశ్చర్యపోయేలా కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని పేర్కొన్నారు. మా ప్రయాణంలో ప్రతి అడుగులోనూ దేవుడు తోడున్నాడు అని చెప్పుకొచ్చారు. ఆయన దయ వల్ల అంతా మేం అనుకున్నట్లే జరుగుతుందని అనుకుంటున్నాం.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ను రూపొందించడం రిస్క్ అనుకోవడం లేదని తెలిపారు. నేను ఈ ప్రాజెక్టును ఎంజాయ్ చేస్తున్నా.. మరి కొన్ని నెలల్లో మీరు ఈ సినిమా బాగా ఆస్వాదిస్తారని అట్లీ వెల్లడించారు.
Read Also: Chennai Super Kings: ఎందుకయ్యా మీకు అంత కంగారు.. మేమే అన్ని విషయాలు అప్డేట్ చేస్తాం
అయితే, తాజాగా వచ్చిన ‘కాంతార చాప్టర్ 1’పై డైరెక్టర్ అట్లీ ప్రశంసించారు. ఆ సినిమా అద్భుతం.. కాంతార 1ను నేను మొదటి రోజు చూశా.. విదేశాల్లో ఉండడంతో థియేటర్‌కు వెళ్లడం కోసం దాదాపు రెండున్నర గంటలు డ్రైవ్ చేసుకుంటూ వెళ్లినట్లు తెలియజేశాడు. మూవీ చూసిన వెంటనే రిషబ్ శెట్టికి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపా.. నేను చాలా గౌరవించే వ్యక్తుల్లో అతడు ఒకరు. నాకు మంచి ఫ్రెండ్ కూడా.. ఇలాంటి సినిమాను తీయడం ఎంత కష్టమో ఒక డైరెక్టరుగా నాకు తెలుసు అని అట్లీ పేర్కొన్నారు.
Last 45 seconds words is enough 🥵 #alluarjun #AA22 #atlee #SaiAbhyankkar #AA22xA6pic.twitter.com/aYR4LgFxLE
— AArya_🗡️❤️🔥BhAAi-🔥 (@icon_GodzilllAA) October 10, 2025