మల్టీ టాలెంటెడ్ స్టార్ విజయ్ ఆంటోనీ తన 25వ సినిమా ‘భద్రకాళి’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలానీ, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, మాస్టర్ కేశవ్ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించగా. విజయ్ ఆంటోని ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ పై మీరా విజయ్ ఆంటోని సమర్పణలో అరుణ్ ప్రభు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇక ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అద్భుతమైన స్పందన రాగా, ఇటి వల విడుదలైన టీజర్ కూడా ఎంతో ఆకట్టుకుంది..
Also Read : Sunny Leone: తెలుగులో సన్నీ లియోన్ ఐటెం సాంగ్..
ఈ సినిమాలో విజయ్ ఆంటోని అసలు ఏ పాత్రను పోషిస్తున్నాడన్నది సస్పెన్స్ కలిగిస్తుంది. ఒకసారి ఫ్యామిలీ మేన్‌లా, మరోసారి గ్యాంగ్ స్టర్‌లా అనిపిస్తున్నారు.. ఇంకో సందర్భంలో ఉన్నతాధికారిలా కనిపిస్తున్నారు… అసలు ఈ కిట్టు ఎవరు? అనే ఆసక్తిని రేకెత్తించేలా భద్రకాళి టీజర్‌ను కట్ చేశారు. విజయ్ ఆంటోని ఈ చిత్రంలో ఇది వరకు ఎన్నడూ కనిపించినంత స్టైలిష్‌గా, యాక్షన్ హీరోగా కనిపిస్తున్నారు. కాగా ఈ చిత్రం సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. దీంతో ఈ తాజాగా ‘భద్రకాళి’ టీం ప్రేస్ మీట్ నిర్వాహించారు. ఇందులో భాగంగా ఏషియన్ సురేష్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న సినిమాకి గురించి సౌండ్ గట్టిగా వినిపించాలని డమ్మీ గన్స్(సినిమాల్లో వాడేవి ) ఎక్కుపెడుతూ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.