రాజశ్రీ ఫిలిమ్స్ చిత్రాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ కళ్ళుమూసుకుని చూడవచ్చని నమ్ముతుంటారు. అలా 1906లో విడుదలై ఘన విజయం సాధించిన సినిమా ‘వివాహ్’. షాహిద్ కపూర్, అమృతా రావు జంటగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు సూరజ్ బర్జాత్య. ఇప్పుడీ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు సమాచారం. బెల్లంకొండ గణేశ్ హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా ఈ రీమేక్ తెరకెక్కనున్నట్లు వినిపిస్తోంది. తన రెండో కొడుకుని ఫ్యామిలీ ఆడియన్స్ లోకి తీసుకు వెళ్ళడానికి ఈ సినిమా పనికి వస్తుందని బెల్లంకొండ సురేశ్ నమ్ముతున్నాడట. అందుకే రీమేక్ రైట్స్ కొనుగోలు చేశారట. యూత్ లో ఫుల్ క్రేజ్ ఉన్న కృతి శెట్టిని కథానాయికగా ఎంపిక చేశారట. ఈ ఏడాదిలోనే సినిమా షూటింగ్ ఆరంభించి వచ్చే ఏడాది విడుదల చేయాలని ప్లాన్. అన్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ తెలుగు హిట్ ‘ఛత్రపతి’తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంటే, తమ్ముడు బెల్లకొండ గణేశ్ బాలీవుడ్ హిట్ ‘వివాహ్’ను తెలుగులో రీమేక్ చేయబోతున్నాడన్నమాట. మరి ఈ రెండు సినిమాలు అన్నదమ్ములకు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూద్దాం