టాలీవుడ్ నటుడు బెల్లంకొండ శ్రీనివాస్ కు రాక్షసుడు తర్వాత హిట్ లేదు. వరుస సినిమాలైతే చేస్తున్నాడు కానీ హిట్ అనేది గగనం అయింది. ప్రస్తుతం రెండు సినిమాలను పట్టాలెక్కించాడు బెల్లంకొండ శ్రీనివాస్. కౌశిక్ పెగళ్లపాటి దర్శకత్వంలో భగవంత్ కేసరి వంటి హిట్ చిత్రాలను నిర్మించిన షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో షూటింగ్ ప్రారంభించారు. మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానేర్ లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటిస్తున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. మహేష్ చందు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహారిస్తుంగా లుధీర్ బైరెడ్డి దర్శకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ రెండు సినిమాలతో పాటు మరో చిత్రానికి కూడా బెల్లంకొండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వరుస ఫ్లాప్ లలో ఉన్న అల్లరి నరేష్ కు నాంది చిత్రంతో హిట్ అందించాడు దర్శకుడు విజయ్ కనకమేడల దర్శకత్వంలో ఒక చిత్రం చేయనున్నారు.తాజగా విజయ్ కనకమేడల ఓ స్టోరీ బెల్లంకొండకు వినిపించాడని టాక్. ఈ చిత్రం మల్టీస్టారర్ గా తెరకెక్కునుందని సమాచారం. సాయి శ్రీనివాస్ తో పాటుగా నారా రోహిత్ కూడా ఏ చిత్రంలో నటిస్తున్నాడని తెలిసింది. రోహిత్ కూడా ఇటీవల హిట్లు లేక సతమతవుతున్నాడు. తన హిట్ చిత్రం ప్రతినిధికి సిక్వెల్ గా ప్రతినిధి -2తో ఆడియన్స్ ని పలకరించాడు ఈ యంగ్ హీరో. కానీ హిట్టు మాత్రం దక్కలేదు. నేడు రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంపై అధికారక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ మల్టీస్టారర్ రూపంలో అయినా హిట్ వస్తుందేమో చూడాలి.
Also Read: Kiran abbavaram : కుమ్మేసిన కిరణ్ ‘క’ థియేట్రికల్ బిజినెస్ ..!