ఈ ఏడాది ఆరంభంలో డాకు మహారాజ్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు బాలయ్య. ఒక స్టైలిష్ యాక్షన్ సినిమాతో ఆడియెన్స్ ను మెప్పించాడు. అదే జోష్ లో ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ 2’ చేస్తున్నాడు. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు బాలయ్య. ఇటీవల హిమాలయాలలో అఘోరాకు సంబంధించిన కీలక సన్నీవేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దసరా కానుకగా రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు.. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని ఓ టాక్ అయితే టాలీవుడ్ సిర్కిల్స్ లో వినిపిస్తోంది.
Also Read : AK 64 : మరోసారి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ తో అజిత్ కుమార్..?
ఇక ఇప్పడు బలయ్య నెక్ట్స్ సినిమా ఎవరితో అనే దానిపై గత కొద్దీ కాలంగా చర్చ నడుస్తుంది. ఈ రేస్ లో గోపీచంద్ మలినేని, హరీష్ శంకర్ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. ఇద్దరు ఇటీవల బాలయ్యకు కథలు వినిపించారు. అయితే ఇప్పుడు గోపీచంద్ మలినేనితో సినిమాకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అందుకు సంబంధించి అధికారక ప్రకటన కూడా బాలయ్య బర్త్ డే నాడు రాబోతుంది. గతంలో వీరి కాంబోలో వచ్చిన వీరసిమహరెడ్డి సూపర్ హిట్ గా నిలిచింది. మరి ముఖ్యంగా బాలయ్య లుక్, గెటప్ ఓ రేంజ్ లో ఉందని ప్రేక్షకుల నుండి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. దీంతో మరోసారి గోపిచంద్‌తో సినిమా చేసేందుకురెడీ అవుతున్నాడు బాలయ్య. అయితే ఈసారి గోపీచంద్ మలినేని, బాలయ్యతో చేసే సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఊర మాస్ సినిమా ప్లానింగ్‌లో ఉన్నాడట. ఈ సినిమను వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు నిర్మించనున్నారు