ఎన్టీఆర్ ‘శ్రీనాథకవిసార్వభౌమ’ మూవీ షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు.. తండ్రి సినిమా అందులోను చారిత్రాత్మకం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య.. అదే స్టూడియోలో ఇంకోసెట్లో ‘జంతర్ మంతర్’ మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది.. ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడటానికి వచ్చిన బాలయ్య.. ‘జంతర్ మంతర్’ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా, ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు.
Also Read: Jr NTR : బన్నీ మిస్సైన కథతో జూనియర్ ఎన్టీఆర్.. నాగవంశీ హింట్స్!
ఎంతసేపట్నుంచి పట్టుకుని ఉన్నాడో దాని బరువు మోయలేక అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయేలా కనిపించాడు. షాట్ మధ్యలో ఉంది.. వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్య లైట్ పట్టుకున్నాడు.. ఇది గమనించిన ఆ సినిమా డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు. షాట్ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ని ‘పసిపిల్లలతో ఏంట్రా ఇది.. రీల్ తగలబెట్టేస్తా’ అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు. పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో బక్కచిక్కి నీరసంగా ఉన్న ఆ కుర్రాడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నం పెట్టి వాళ్ళ తల్లిదండ్రులని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు. ఒక అరగంటలో ఆ కుర్రాడితో స్టూడియో మేనేజర్ తిరిగి వచ్చాడు.
పక్షవాతంతో తండ్రి, మూర్ఛ రోగం తో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు. వెంటనే తార్నాకలోని హాస్పిటల్ లో చేర్పించమని, వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానె భరిస్తానని చెప్పి.. ఆ కుర్రాడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు. కష్టపడి చదువుకున్న ఆ కుర్రాడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు.