అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబోలో ఓ పాథలాజికల్ ఫిల్మ్ రావాల్సి ఉంది. కానీ బన్నీ.. ముందు అట్లీ ప్రాజెక్ట్‌ను మొదట పట్టాలెక్కించాడు. దీంతో త్రివిక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు. మొదట అల్లు అర్జున్ కోసం ఎదురుచూసినప్పటికి అతని నుంచి క్లారిటీ రాకపోవడంతో, త్రివిక్రమ్ ఈ పౌరాణిక కథను ఎన్టీఆర్ తో చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. నిజానికి త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ ఫిల్మ్‌ని మొదట తారక్‌తోనే చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని నిర్మాత నాగవంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబోలో భారీ మైథలాజికల్ ఫిల్మ్ ప్లాన్ చేస్తున్నామని, అది గ్లోబల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. అది కూడా కుమారస్వామి కథ అని టాక్. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ పై..
Also Read : Surya 46 : ‘సూర్య 46’ గ్రాండ్ షూటింగ్ స్టార్ట్ – కొత్త పోస్టర్ వైరల్ !
నిర్మాత సూర్య దేవర నాగవంశీ తన ఎక్స్ (మాజీ ట్విట్టర్) ఖాతాలో ఇచ్చిన హింట్ ఇప్పుడు సంచలనంగా మారింది. “మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్‌గా కనిపించనున్నారు” అంటూ పోస్ట్ చేసిన ఆయన, ఆ మేరకు కుమారస్వామిపై ఒక శ్లోకాన్ని కూడా షేర్ చేయడంతో ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఎన్టీఆర్‌దే అని కన్ఫర్మ్ అయిపోయింది. త్రివిక్రమ్‌కు పురాణాలు, మానవ విలువలు కలగలిసిన కథలపై ప్రత్యేక మక్కువ ఉంది. కుమారస్వామి కథను ఆధారంగా చేసుకుని ఒక ఇంటర్నేషనల్ లెవెల్ మైథలాజికల్ ప్రాజెక్ట్‌ను డెవలప్ చేశారని సమాచారం. దీనికి సంబంధించి విజువల్స్, గ్రాఫిక్స్, ప్రొడక్షన్ డిజైన్ అన్నీ కూడా హయ్యెస్ట్ స్టాండర్డ్స్‌లో ఉండబోతున్నాయి.పైగా ఇలాంటి పౌరాణిక పాత్రలకు నందమూరి కుటుంబం పెట్టింది పేరు. గతంలో జూనియర్ ఎన్టీఆర్.. యముడి పాత్రలో నటించి మెప్పించాడు. ఇప్పుడు కుమారస్వామి పాత్రకు ప్రాణం పోస్తాడు అనడంలో సందేహం లేదు.
My most favourite anna as one of the most powerful gods. pic.twitter.com/Vq4dFV3lJd
— Naga Vamsi (@vamsi84) June 11, 2025