Aay: ఆయ్ అంటున్న ఎన్టీఆర్ బావమరిది….
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా రూపొందుతోన్న చిత్రం ‘ఆయ్’… GA2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9గా హిలేరియస్ ఎంటర్‌టైనర్ టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించిన చిత్ర యూనిట్.వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also Read; Salaar 2 : సలార్ పార్ట్ 2 షూటింగ్ అప్డేట్.. అప్పటినుంచే రెగ్యులర్ షూట్..
Also Read
‘ఆయ్’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. నిర్మాత బన్నీవాస్, హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ అంజి కంచిపల్లి మధ్య జరిగే సరదా ఫోన్ సంభాషణతో టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించటం విశేషం.ప్రొడ్యూసర్స్ లో ఒకరైన బన్నీవాస్ దర్శకుడు అంజికి ఫోన్ చేస్తారు. టైటిల్ గురించి మాట్లాడే సందర్భంలో డైరెక్టర్ గోదావరి ప్రాంత ప్రజలు మాట్లాడే ‘ఆయ్’ పదంతో విసిగిపోతారు. అదే క్రమంలో హీరో, హీరోయిన్ లకు సైతం కాల్ కనెక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ‘ఆయ్’ని తప్పుగా టీమ్ అర్థం చేసుకోవటంతో వీడియో చూస్తున్నవారికి నవ్వు తెప్పిస్తుంది.
Also Read: Police Raids on TDP Leaders Houses: నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..
నిర్మాత సరదా సంభాషణ, ఫన్నీ మీమ్స్ రెఫరెన్స్‌లతో టైటిల్ అనౌన్స్‌మెంట్స్ కాన్సెప్ట్ వీడియో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇదే క్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘సమ్మర్‌లో కలుద్దాం’ అంటూ సినిమా సమ్మర్ లో విడుదలవుతుందని తెలియజేశారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ మార్చి 7న రిలీజ్ అవుతుందని వీడియో చివరలో రివీల్ చేశారు.ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.
తాజావార్తలు
-
New Bajaj Pulsar NS125 Leak: కొత్త Bajaj Pulsar NS125 ఫస్ట్ లుక్.. LCD డిస్ప్లే, USB-C ఛార్జింగ్‌తో కొత్త ఫీచర్లు!
-
Aafiya Sayed : టాలీవుడ్లోకి బాలీవుడ్ యంగ్ బ్యూటీ ఇంట్రడ్యూస్
-
Pawan Kalyan: అడవి తల్లి బాట 2.0 కార్యక్రమం ప్రారంభం.. స్థానిక ఎన్నికల్లో కూటమి సత్తా చాటాలి.!
-
Supreme Court: సీజేపీ నిరసన ఎఫెక్ట్.. పోలీసులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు..
-
Chiranjeevi: వయసు ఒక నంబర్ మాత్రమే..! ప్రేమ, అభిమానమే నాకు ఎనర్జీ..
ట్రెండింగ్
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!