పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. గత ఏడాది సలార్ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు.. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించారు.. గత సంవత్సరం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సలార్ సినిమా థియేటర్స్ లో హిట్ కొట్టి దాదాపు 700 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో కూడా చాలా రోజుల పాటు ట్రెండింగ్ లో ఉంది. ఇక ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉండటంతో ఆ సినిమా ఎప్పుడు వస్తుందా అని ఆయన ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. తాజాగా ఈ సినిమా షూట్ పై క్లారిటి వచ్చింది..
ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898AD మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ఇప్పుడు మారుతి దర్శకత్వంలో రాబోతున్న రాజాసాబ్ సినిమా ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు.. ఆ తర్వాత సలార్ పార్ట్ 2 షూటింగ్ మొదలుపెట్టనున్నాడట ప్రభాస్. సందీప్ వంగ స్పిరిట్ సినిమా షూట్ నెక్స్ట్ ఇయర్ లో మొదలవుతుందని సందీప్ ప్రకటించాడు. ఈలోపు సలార్ 2 పూర్తిచేద్దామని డార్లింగ్ ఫిక్స్ అయ్యారట.. అయితే ఈ సినిమా షూటింగ్ అప్డేట్ ను నటుడు ఇచ్చేశాడు..
ప్రముఖ నటుడు బాబీ సింహ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. సలార్ పార్ట్ 2 షూటింగ్ ఏప్రిల్ నుంచి ఉండొచ్చని, ఆ సినిమా షూట్ కోసం ఎదురుచూస్తున్నాను అని తెలిపాడు. దీంతో ఏప్రిల్ లో సలార్ పార్ట్ 2 షూట్ మొదలవ్వనుందని టాలీవుడ్ సమాచారం… అంటే వచ్చే నెల నుంచి షూటింగ్ స్టార్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.. ఇక దీనిపై సలార్ టీమ్ క్లారిటి ఇవ్వాల్సి ఉంది..