హీరో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్. తోలి సినిమాలో అశోక్ నటనకు మంచి మార్కులే వేశారు క్రిటిక్స్. కానీ రెండవ సినిమా దేవకీ నందన వాసుదేవ చిత్రంతో భారీ ప్లాప్ అందుకున్నాడు అశోక్. దాంతో ట్రాక్ మార్చి యూత్ ఫుల్ స్టోరీ తో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఓ సినిమా చేస్తున్నాడు. అమెరికా నేపథ్యంలో సాగే ఈ చిత్రం.. విదేశాలలో చదువుతున్న భారతీయ విద్యార్థుల జీవితాలను, వారి కలలను, సందిగ్ధతలను, స్నేహాలను మరియు మధుర క్షణాలను ప్రేక్షకుల మనసుకి తాకేలా చూపించనుంది.
Also Read : Tollywood : టాలీవుడ్‌కు అవమానం.. ఛీ కొట్టిన ప్రముఖ పోర్టల్
తాజాగా ఈ సినిమాకు సంబందించి ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టైటిల్ ను రిలీజ్ చేసారు మేకర్స్. ఈ సినిమాకు ‘వీసా’ వింటారా సరదాగా అనే ట్యాగ్ లైన్ తో టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ ఫస్ట్ లుక్‌లో అశోక్ గల్లా కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. యువత మెచ్చేలా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి నూతన దర్శకుడు ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు. అశోక్ గల్లా, శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వీసా సినిమా టీజర్ ను ఈ శనివారం ఉదయం 10.53 గంటలకు రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ చిత్రానికి సంబంధించి ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. మాస్ యాక్షన్ సినిమాలతో నెగిటివ్ రిజల్ట్స్ అందుకున్న అశోక్ గల్లా వీసా సినిమాతో హిట్ కొడతాడని ధీమాగా ఉన్నాడు. నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమా ఈఏడాదిలోనే థియేటర్స్ లోకి రానుంది.