ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ మాత్రమే అని ట్రీట్ చేసిన నార్త్ సినీ పెద్దలకు సౌత్ ఇండస్ట్రీ దెబ్బ ఎలా ఉంటుందో రుచి చూపించింది టాలీవుడ్. తెలుగు చిత్ర పరిశ్రమను ప్రపంచ వ్యాప్తంగా ఇనుమడింపచేసేలా ఎదిగింది. ఆస్కార్ అవార్డు కొల్లగొట్టి బీటౌన్ ముందు తల ఎగరేసింది. కానీ ఇప్పుడు ఇంట గెలవలేకపోతుందా అంటే ఔననే ఫ్రూవ్ చేస్తోంది ప్రముఖ రేటింగ్ సంస్థ ఐఎండీబీ. ఈ సంస్థ సినిమాలకు రేటింగ్స్ అండ్ రివ్యూస్ ఇస్తుంది. అలాగే ఈ ఏడాది హాఫ్ ఇయర్లీలో అత్యధిక ప్రజాదరణ పొందిన టాప్ 10 సినిమాల జాబితాను రిలీజ్ చేస్తే ఒక్కటంటే ఒక్క తెలుగు సినిమా లేకపోవడం ఆశ్చర్యకరం.
Also Read : RAPO 22 : హైదరాబాద్ లో ఆంధ్ర కింగ్..
ఈ ఆరు నెలల కాలంలో టాలీవుడ్ నుండి ఎన్నో సినిమాలు వచ్చాయి. వాటిల్లో కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు పట్టం కట్టారు ఆడియన్స్. సంక్రాంతికి వస్తున్నాం, మ్యాడ్ స్క్వేర్, సింగిల్, శుభం, కోర్టు చిత్రాలు లాభాల పంట పండిచాయి. కుబేర, ఢాకూ మహారాజ్, తండేల్ సక్సెస్ అందుకున్నాయి. కానీ ఈవేమీ కూడా ఐఎండీబీలో ఫస్ట్ పది స్థానాల్లో చోటు దక్కించుకోకపోవడం చూస్తుంటే ప్రజాదరణ పొందే సినిమాలు టాలీవుడ్ ఇవ్వడం లేదా అన్నడౌట్ రాకమానదు. ఇందులో మరో విశేషమేమిటంటే బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడిన సినిమాలు ఐఎండీబీలో టాప్ రేటింగ్‌లో నిలవడం కూడా అనుమానాలు తలెత్తుతున్నాయి. జనవరి 1 నుండి జులై 1 మధ్య అత్యంత ప్రజాదరణ పొందిన టాప్ 10 భారతీయ చిత్రాల లిస్ట్ చుస్తే 1 .చావా. 2. డ్రాగన్ (తమిళ్), 3. దేవా – హిందీ 4. రైడ్ – హిందీ, 5. రెట్రో (తమిళ్) 6. ది డిప్లామాట్ – (హిందీ) 7. ఎల్2 ఎంపురన్ (మళయాలం) 8. సితారే జమీన్ పర్ (హిందీ), 9. కేసరి చాప్టర్ 2 (హిందీ), 10. విదాముయర్చి (తమిళ్) స్తానం సంపాదించాయి.