ఇరవై సంవత్సరాల వయసులో ‘ప్రేమకోసం’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఆశా సైనీ. దర్శకుడు వీరశంకర్ రూపొందించిన ఆ సినిమా 1999లో విడుదలైంది. ఈ ఇరవై రెండేళ్ళలో పలు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, పంజాబీ చిత్రాల్లోనూ ఆశా సైనీ నటించింది. దక్షిణాది కంటే ఉత్తరాదిన అవకాశాలు ఎక్కువ లభిస్తుండటంతో ఐదారేళ్ళుగా హిందీ సినిమాల మీదనే ఫోకస్ పెట్టింది. అయితే ఆశా సైనీ కంటే తన అసలు పేరు ఫ్లోరా సైనీనే అచ్చివచ్చిందని భావించిన ఈ అందాల భామ అదే పేరుతో కంటిన్యూ అవుతోంది.
తాజాగా బాలీవుడ్ ను కుదుపేస్తున్న రాజ్ కుంద్రా పోర్న్ రాకెట్ వివాదంలో ఫ్లోరా సైనీ పేరు సైతం వినిపిస్తోంది. రాజ్ కుంద్రా అతని భాగస్వామి ఉమేశ్ కామత్ మధ్య జరిగిన వాట్సప్ చాట్ లో ‘బాలీ ఫేమ్’ అనే సినిమాలో ఫ్లోరా సైనీ పై పాట తీయాలనే చర్చ వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని ఫ్లోరా ఖండించింది. రాజ్ కుంద్రాతో కానీ ఉమేశ్ తో గానీ తానెప్పుడూ మాట్లాడలేదని, వాళ్ళు కూడా తమ చిత్రంలోని పాట విషయమై తనతో సంప్రదించలేదని స్పష్టం చేసింది. కొంతమంది పనికట్టుకుని తన పేరును ఈ వివాదంలోకి లాగుతున్నారని, ఇది భావ్యం కాదని ఆమె వాపోయింది.
Read Also : సైన్స్ ఫిక్షన్ మూవీకి శర్వానంద్ గ్రీన్ సిగ్నల్
‘గంధీ బాత్’ అనే బోల్డ్ కంటెంట్ ఉన్న వెబ్ సీరిస్ లో తాను నటించిన మాట వాస్తవమేనని, అందులో ఆ పాత్రను పోషించడాన్ని ఛాలెంజ్ గా తీసుకున్నానని తెలిపింది. రాజ్ కుంద్రా వివాదం సందర్భంగా ‘గంధీ బాత్’ ఫేమ్ గా తనను ప్రస్తావిస్తున్న వారు… తాను నటించిన ‘స్త్రీ, బేగమ్ జాన్, లక్ష్మీ’ లను ప్రస్తావించకపోవడం శోచనీయమని ఆమె అంటున్నారు. పోర్న్ వీడియోస్ వివాదంలో తన పేరును లాగడం కరెక్ట్ కాదని, అలాంటి ప్రచారాన్ని కూడా తాను కోరుకోవడం లేదని ఫ్లోరా సైనీ తెలిపింది.