ప్రజంట్ టాలీవుడ్ నుంచి వరుస పెట్టి సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఇందులో వచ్చే ఏడాది మార్చి 26, 27 తేదీల్లో క్లాష్ అయ్యేందుకు రెడీ అవుతున్నవి మాత్రం నాని ‘ప్యారడైజ్’, రామ్ చరణ్ ‘పెద్ది’ మూవీస్. ఈ రెండు సినిమాల పై ప్రేక్షకుల అంచనాలు మాములుగా లేవు. ఎందుకంటే ‘పెద్ది’ మూవీ లో వింటెజ్ చరణ్‌ని చూడబోతున్నాం. ఇక ‘ప్యారడైజ్’ లో నాని మొత్తం లుక్ మార్చేశాడు. అందుకే ఈ రెండు చిత్రాల గురించి అందరూ ఎక్కువగా మాట్లాడుతున్నారు. కానీ వీటికన్నా వారం ముందు మార్చి 19 రాబోతున్న ‘టాక్సిక్’ ని తక్కువ అంచనా వేస్తున్నారు. ఏడు రోజుల గ్యాప్ ఉన్నా సరే యష్ మూవీని సులభంగా చేసుకోవడానికి లేదు. ఎందుకంటే ఉత్తరాది మార్కెట్‌లో ‘కెజిఎఫ్’ తో యష్‌కు భారీ డిమాండ్ పెరిగిపొయింది. దీంతో ఈ మూవీ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఎంతో తెలివిగా ఈ మూవీని తీర్చిదిద్దుతుంది.
Also Read: Deepika Padukone : తల్లి పాత్రలో దీపిక..
అంటే దీని బట్టి చూస్తే నార్త్ స్టేట్స్‌లో ‘టాక్సిక్’ ,‘ప్యారడైజ్’, ‘పెద్ది’ సినిమాలకు పోటీ మామూలుగా అయితే ఉండదు. ఒకవేళ యష్ మూవీ కనక బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంటే దానికి దీటుగా రామ్ చరణ్, నానిలు మెప్పించాల్సి ఉంటుంది. ఇక ‘పుష్ప 2’ పంపిణీ చేసిన అనిల్ తదానినే ‘టాక్సిక్’ ఇంకా ‘పెద్ది’ మూవీస్‌కు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అంతేకాదు బాలీవుడ్ నుండి మార్చి 21 రన్బీర్ కపూర్ – సంజయ్ లీలా భన్సాలీ ‘లవ్ అండ్ వార్’ మూవీ సైతం విడుదలకు రెడీ అంటోంది. ఇక వచ్చే ఏడాది మార్చి అంటే ఇంకా చాలా టైం ఉంది కనక ఎవరెవరు తప్పుకుంటారు. ఎవరు మాట మీద ఉంటారనేది చూడాలి. కానీ మొత్తానికి రాబోయే రోజుల్లో మూవీ లవర్స్ కి ఫుల్ మీల్స్ అని మాత్రం అర్ధం అవుతుంది.