అనుష్క తన సినిమాలతో తప్ప పెద్దగా ప్రపంచంతో మాట్లాడదు. పైగా మహారాణి ‘దేవసేన’ ఈ మధ్య సినిమాలు కూడా బాగా తగ్గించింది. ఆమెతో ప్రాజెక్ట్స్ కోసం దర్వకనిర్మాతలు రెడీగా ఉన్నా, చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధంగా ఉన్నా స్వీటీ మాత్రం స్లో అండ్ స్టెడీగా వెళుతోంది. ‘బాహుబలి’ మూవీస్ తరువాత ఆమె చేసిన చిత్రాలు చాలా తక్కువ. చివరిసారిగా ‘నిశ్శబద్ధం’ సినిమాలో కనిపించిన అను ఇంత వరకూ ఇంకా మరో సినిమాపై ప్రకటన చేయలేదు. అయితే, ఎప్పుడూ లేనిది ఆమె తన సొషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో ఓ లెంగ్తీ మెసేజ్ షేర్ చేసింది. అనుష్క ఎమోషనల్ పోస్ట్ చూసి నెటిజన్స్ కూడా ఎమోషనల్ అవుతున్నారు. కొందరు ఆశ్చర్యపోతున్నారు కూడా….
Read Also : మొన్న కొడుకు, నేడు భర్త… తీవ్ర దుఃఖంలో సీనియర్ నటి
’మీ మనసులోని మాటల్ని పది మందికీ చెప్పండి. అందరికీ మీరు ఎంతగా వార్ని ప్రేమిస్తున్నారో తెలియజేయండి. మీరు ఏం ఫీలవుతున్నారో దాన్ని చూసి భయపడకండి. ఏడ్చిన ప్రతీసారి ఆ కన్నీటిలోనూ అందాన్ని చూడండి! ఇంత వరకూ ఏం జరిగినా స్థైర్యం కోల్పోకుండా ముందుకు సాగే ప్రయత్నం చేయండి. మీ స్నేహితుల ముఖాల్ని ముద్దాడండి. వారి విరిగిన హృదయాల్ని జోడిస్తూ గాఢంగా వాటేసుకోండి. అనుబంధం, అనుబంధం, అనుబంధం…. మనస్ఫూర్తిగా అనుబంధాల్ని పెంచుకోండి. కళ్లలో నీళ్లు తెప్పించే క్షణాలతో అనుబంధం పెంచుకోండి. చేతులు వణికిపోయే లాంటి ఉద్విగ్న విషయాల పట్ల అనుబంధం పెంచుకోండి. ఇంకా మనం బతికే ఉన్నామని మనకు నిరూపించే అద్భుత విషయాల్ని గుర్తించి, ఆస్వాదించండి. ఎందుకంటే, అందమైనవి రోజురోజుకి మన మధ్య నుంచీ మాయమైపోతున్నాయి. మీ హృదయాన్ని వాటిల్లో ఒకటి కానివ్వకండి!’’ అనుష్క ఇలా రాసుకుంటూ సాగిపోయింది. ఆమె ఇంగ్లీష్ లో పెట్టిన ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు ఫ్యాన్స్ ని, నెటిజన్స్ అందర్నీ కూడా ఆలోచనలో పడేసింది. ఆమె కరోనా కాలంలోని లాక్ డౌన్ పరిస్థితుల్ని, జనం ఎదుర్కొంటోన్న తీవ్రమైన మానసిక ఒత్తిడుల్ని దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘమైన పోస్టు రాసి ఉంటుందని భావిస్తున్నారు…
A post shared by AnushkaShetty (@anushkashettyofficial)